Search This Blog

Tuesday, August 16, 2022

Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణానికే ముప్పు.. రోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇప్పుడే పుల్‌స్టాప్‌ పెట్టండి

Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణానికే ముప్పు.. రోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇప్పుడే పుల్‌స్టాప్‌ పెట్టండి

శరీరంలో కొవ్వు పరిమాణం ఎక్కువైతే అనేక వ్యాధుల ప్రమాదం అమాంతం పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణానికే ముప్పు.. రోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇప్పుడే పుల్‌స్టాప్‌ పెట్టండి
    Cholesterol

    Cholesterol Sudden Increase: ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ శరీరంలో కొవ్వు పరిమాణం ఎక్కువైతే అనేక వ్యాధుల ప్రమాదం అమాంతం పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మన ఆరోగ్యానికి ప్రమాదకరం. దీని పెరుగుదల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఒక్కోసారి మీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ అసలు దేని కారణంగా పెరుగుతుందో తెలుసుకోవడం చాలాముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

    ఈ కారణాల వల్ల కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది..

    కాఫీని అధికంగా తీసుకోవడం: కాఫీలో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తపోటు వేగంగా పెరుగుతుంది. మరోవైపు, మీరు రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకుంటే అది మీకు ప్రాణాంతకం కావచ్చు.

    మానసిక ఒత్తిడి: ఒత్తిడి, కొలెస్ట్రాల్ స్థాయి మధ్య బలమైన సంబంధం ఉంది. మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీనితో పాటు మీ దినచర్యలో యోగాను కూడా చేర్చుకోవాలి.

    ధూమపానం: ధూమపానం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే సిగరెట్‌లలో ఉండే నికోటిన్ మన ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా శరీరంలో కాటెకోలమైన్‌లు విడుదలవుతాయి. దీంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, మీరు కూడా ధూమపానం చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి.

    మందులు: కొన్ని మందుల వాడకం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చాలా వేగంగా పెరుగుతుంది. ఇందులో రక్తపోటును తగ్గించే మందులు, యాంటీ సైకోటిక్స్ మొదలైనవి ఉన్నాయి.

    TSWREIS

    TGARIEA ONLINE MEMBERSHIP

    MATHS VIDEOS

    EAMCET/IIT JEE /NEET CLASSES

    Top