Search This Blog

Sunday, August 28, 2022

Bitter Gourd Benefits: కాకరకాయ తింటే చాలు.. ఆ రోగాలు మీ దరి చేరవు.. | Benefits of Bitter gourd

Bitter Gourd Benefits: కాకరకాయ తింటే చాలు.. ఆ రోగాలు మీ దరి చేరవు.. | Benefits of Bitter gourd 

మనం రుచికారమైన ఆహారాన్ని ఇష్టపడతాం. అది మన ఆరోగ్యానికి మంచిది కాకపోయినా రుచి బాగుంటే తింటాం. ఆరోగ్యానికి మంచిదైనా ఆహారం రుచిగా లేకుంటే అస్సలు తినం. అలాంటి పదార్థల్లో కాకరకాయ ఒక్కటి. చాలా మంది కాకర పదం వింటేనే అమ్మో కాకరకాయ కూర అని పెదవి విరుస్తారు. కానీ దీని ఉపయోగాలు తెలిస్తే తినడం ప్రారంభిస్తారు.

1

1

యాంటీ ఆక్సిడెంట్లు

కాక‌య కాయ‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తాయి. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాకరకాయ తరచుగా తినడం వల్ల శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట. కాక‌ర కాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు రావట.

2

2

చెడు కొలెస్ట్రాల్‌

కాకర టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువ కావున శరీరానికి చాలా రకాల లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ టీ కరోనా వల్ల శరీరం దెబ్బతిన్న వారికి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను సులభంగా నియంత్రిస్తాయి.

Advertisement
3

3

కిడ్నీలో రాళ్లు

కాక‌రకాయ‌లో ఉండే ఫైబ‌ర్‌ జీర్ణ స‌మ‌స్య‌లను దరి చేరనివ్వదు. కాకరకాయ తింటే మల‌బ‌ద్ధకం స‌మస్య‌ తగ్గుతుంది. కాక‌రకాయ జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు కూజా క‌రుగుతాయట. కాకరకాయలో ఉన్న ఆల్కలైడ్లు బ్లడ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top