Search This Blog

Sunday, July 24, 2022

TSPSC Food Safety Officer Recruitment

TSPSC Jobs 2022: తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలు, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే.

TSPSC Food Safety Officer Recruitment
TSPSC Jobs 2022
TSPSC Food Safety Officer Recruitment 2022:తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రజారోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల నియామకానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటన జారీ చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 26 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


ముఖ్య సమాచారం:
  • మొత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు: 24
  • అర్హతలు: బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ). లేదా మాస్టర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (మెడిసిన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయస్సు: 01-07-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి.
  • జీత భత్యాలు: రూ.42300 - 115270 వరకు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.280
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: జులై 29, 2022
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 26, 2022
  • పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) తేది: నవంబర్, 2022.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.tspsc.gov.in/

నోటిఫికేషన్‌






TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top