Search This Blog

Monday, July 25, 2022

Presidential Election: జులై 25 నాడే రాష్ట్రపతుల ప్రమాణ స్వీకారం.. కారణం తెలుసా? Presidential Election: జులై 25 నాడే రాష్ట్రపతుల ప్రమాణ స్వీకారం.. కారణం తెలుసా?

Presidential Election: జులై 25 నాడే రాష్ట్రపతుల ప్రమాణ స్వీకారం.. కారణం తెలుసా?

Presidential Election: జులై 25 నాడే రాష్ట్రపతుల ప్రమాణ స్వీకారం.. కారణం తెలుసా?

దిల్లీ: భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము జులై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10గంటలకు పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. అయితే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి జులై 25వ తేదీని నిర్ణయించడం ఇదే తొలిసారి కాదు. గడిచిన 45 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం విశేషం. తొలిసారిగా దేశ ఆరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న ఆ పదవిని అలంకరించారు. అనంతరం ఆ బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్‌సింగ్‌ నుంచి.. నేటితో పదవీ విరమణ చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ వరకు అందరూ ఇదే తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.

ఈ తేదీ వెనుక ఉన్న కథేంటో చూద్దాం..

1950 జనవరి 26న డా.రాజేంద్రప్రసాద్‌ దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణం చేశారు.1952 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.   మళ్లీ 1957లోనూ ఎన్నికయ్యారు. అనంతరం 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆ తర్వాత పదవి చేపట్టిన కొందరు పూర్తి కాలంపాటు కొనసాగలేకపోయారు. 1967 మే 13న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డా.జాకీర్ హుస్సేన్‌ మే 3 1969లో మృతిచెందారు. వీవీ గిరి తర్వాత ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ సైతం పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోయారు.

అనంతరం నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా 1977 జులై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తికాలంపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్నవారంతా విజయవంతంగా తమ పదవీ కాలాన్ని ముగించారు. జులై 25న బాధ్యతలు స్వీకరించడం.. ఐదేళ్ల తర్వాత జులై 24న పదవీ విమరణ చేయడం ఆనవాయితీగా మారింది. గత 45 ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది మంది రాష్ట్రపతులు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము సైతం ఇదే తేదీన బాధ్యతలు చేపట్టి ఈ జాబితాలో చేరే 10వ వ్యక్తిగా నిలువనున్నారు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top