Oral health: మీ నోరు శుభ్రంగా ఉంటే వృద్ధాప్యంలో ఆ సమస్యే రాదు!!
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని మనం మట్లాడే మాటల గురించి అన్నారు పెద్దలు. కానీ, ఇప్పడు మన నోరు మంచిదైతే.. అంటే శుభ్రంగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దంతాలు లేదా నోటి శుభ్రతపై జీవక్రియ, గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని గత అధ్యయనాల్లో తేలింది. తాజాగా, నోటి ఆరోగ్యం బాగుంటే వృద్దాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) రాదని పరిశోధకులు గుర్తించారు. చిగుళ్ల వ్యాధి వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని తేల్చారు. అందువల్ల క్రమంతప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం అవసరమని తెలిపారు.
అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డెంటల్ మెడిసిన్ నిపుణులు ఎలుకలపై పరిశోధన చేసి ఈ విషయాన్ని తేల్చారు. ఎలుకల్లో చిగుళ్ల వ్యాధికి కారణమవుతున్న ఎఫ్ న్యూక్లియేటమ్ అనే బ్యాక్టీరియా
అల్జీమర్స్‌కు కూడా కారణమవుతోందని తేల్చారు. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలను తగ్గిస్తుందని గుర్తించారు. ఇది మంటను కూడా కలిగిస్తుందని కనుగొన్నారు. డెడ్ న్యూరాన్లను మెదడు వదిలించుకునే విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసి అల్జీమర్స్ పురోగతికి మార్గం సుగమం చేస్తుందని తేల్చారు.
చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించే చిట్కాలు
చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని అధిగమించేందుకు ఉత్తమమైన మార్గం నోటి పరిశుభ్రత. వయస్సు పెరిగేకొద్దీ ఇది కాస్త కష్టసాధ్యమైన పని. అలాగే, క్యాన్సర్ లేదా మధుమేహంతో పోరాడుతున్న వారు లేదా ధూమపానం చేసేవారిలో నోటి శుభ్రత లోపిస్తుంది. మరి దీన్ని అధిగమించేందుకు ఉత్తమ చిట్కాలను పరిశోధకులు సూచించారు.