Lungs cleaning | ఊపిరితిత్తులు శుభ్రం కావాలా..? ఇలా చేయండి..!
నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే, నిత్యం ధూమపానం చేసేవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోతాయి. దీంతో అనేక సమస్యలు వస్తాయి.
ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటునే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేల మన ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటే శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి సమమస్యలు కలుగుతాయి. కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం చాలా ఈజీ. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా..!
ఇవీ తినండి..!
- వారానికి ఐదు యాపిల్ పండ్లను లేదా అంతకంటే ఎక్కువగా వీటిని తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటాయి.
- బీట్ రూట్ లో ఉండే ఆప్టిమైజ్ చేసే సమ్మేళనాలు, నైట్రేట్ లు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.
- గుమ్మడికాయ, గుమ్మడి విత్తనాలను నిత్యం తినడం వల్ల కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.