Search This Blog

Saturday, July 2, 2022

Income Tax: పాత, కొత్త ప‌న్ను విధానాల్లో ఏది బెట‌ర్‌?*

*🔊Income Tax: పాత, కొత్త ప‌న్ను విధానాల్లో ఏది బెట‌ర్‌?*




*ఇంటర్నెట్‌ డెస్క్‌: నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతి ఉద్యోగీ ప్రభుత్వానికి ఏటా పన్ను చెల్లించాలి. భార‌త్‌లో వ్య‌క్తుల స‌గ‌టు ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని ప‌న్ను స్లాబులను రూపొందించారు. అందువ‌ల్ల‌ వ్యక్తి పొందుతున్న ఆదాయం ఆధారంగా పన్ను స్లాబులు వర్తిస్తాయి. పన్ను చెల్లింపుదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ చెల్లించాల్సిన పన్ను కూడా పెరుగుతుంది. ఏటా బడ్జెట్లో సూచించే ప్రతిపాదనల మేరకు స్లాబులు మారుతుంటాయి. ఈ పన్ను స్లాబులు వేర్వేరు కేటగిరీలకు చెందిన వ్యక్తులకు వేర్వేరుగా ఉంటాయి. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల‌ను మూడు రకాలుగా వర్గీకరించింది.*

*వ్యక్తులు (60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు) భారతీయ నివాసితులు, నివాసితులు కానివారు.*

*సీనియర్ సిటిజన్లు (60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారు)*

*సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు)*

*ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రిట‌ర్నులు దాఖ‌లు చేసేవారు పాత (Old Tax Regime) లేదా కొత్త ప‌న్ను విధానాల్లో (New Tax Regime) త‌మ‌కు అనుకూల‌మైన విధానాన్ని ఎంచుకుని రిట‌ర్నులు దాఖ‌లు చేయొచ్చు. పాత ప‌న్ను విధానానికి, కొత్త ప‌న్ను విధానానికి రెండు ప్ర‌ధాన వ్య‌త్యాసాలు ఉన్నాయి. పాత ప‌న్ను విధానంతో పోలిస్తే కొత్త దానిలో త‌క్కువ ప‌న్ను రేటుతో ఎక్కువ‌ స్లాబులు అందుబాటులో ఉన్నాయి. కొత్త దానిలో ఎటువంటి ప‌న్ను మిన‌హాయింపులూ త‌గ్గింపుల‌ను అనుమ‌తించ‌రు. పాత విధానాన్ని ఎంచుకున్న వారికి.. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయాన్ని త‌గ్గించుకోవ‌డానికి దాదాపు 70 త‌గ్గింపులు/మిన‌హాయింపులు అందుబాటులో ఉన్నాయి. ప‌న్ను ఆదా పథకాల్లో మ‌దుపు చేయ‌డం, కొన్ని వ‌స్తు/సేవ‌ల‌పై ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల ప‌న్ను త‌గ్గించుకోవ‌చ్చు.*

*ఏ విధానం బెట‌ర్‌?*

*కొత్త, పాత ప‌న్ను విధానాల‌లో ఏది బెట‌ర్ అంటే.. స‌మాధానం చెప్ప‌డం క‌ష్టం. ఇది ఆ వ్య‌క్తి ఆదాయం, చేసే ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు, త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కొత్త ప‌న్ను విధానంలో మిన‌హాయింపులు, త‌గ్గింపులు ఉండ‌వు. కానీ, స్లాబ్ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే, ప‌న్ను చెల్లింపుదారులు ఎవ‌రి సాయం లేకుండా సుల‌భంగా దాఖ‌లు చేయ‌వ‌చ్చు.పాత ప‌న్ను విధానంలో వివిధ ప‌న్ను మిన‌హాయింపులు, త‌గ్గింపులు ఉంటాయి. ఇవి ఆదాయ‌పు ప‌న్ను వివిధ చ‌ట్టాల‌తో ముడిప‌డి ఉంటాయి. ప‌న్ను చెల్లింపుదారులు ఈ చ‌ట్టాల‌ను అవ‌గాహ‌న చేసుకుని స్వ‌యం రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం కాస్త కష్టంగానే ఉండేది. ఇటువంటి వారు నిపుణుని సాయం తీసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు కొత్త ప‌న్ను విధానాన్ని ఎంచుకోవ‌డం ద్వారా.. ఎటువంటి మిన‌హాయింపులూ చూపించాల్సిన అవ‌స‌రం లేదు కాబ‌ట్టి దాఖ‌లు ప్ర‌క్రియ‌ స‌ర‌ళంగా, సుల‌భంగా ఉంటుంది. అలాగే బీమా, ఇత‌ర పెట్టుబ‌డులు లేని వారు కొత్త ప‌న్ను విధానం ద్వారా ప్ర‌యోజ‌నం పొందొచ్చు.*

*ప‌న్ను చెల్లింపుదారులు తాము చేసిన పెట్ట‌బడులను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని పాత ప‌న్ను విధానం (Old Tax Regime) ప్ర‌కారం ఎంత ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తుందో లెక్కించాలి.*

*ఉదాహ‌ర‌ణకు ఉద్యోగుల‌ను తీసుకుంటే.. ఎల్‌టీఏ, హెచ్‌ఆర్‌ఏ, స్టాండ‌ర్డ్ డిడక్ష‌న్ (రూ.50 వేల వ‌ర‌కు) మిన‌హాయింపును క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. సెక్ష‌న్ 80సి కిందికి వ‌చ్చే ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు చేసేవారు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. అలాగే, గృహ రుణం తీసుకునే వారు వ‌డ్డీ చెల్లింపుల‌పై, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుల‌పై, ఎన్‌పీఎస్‌ మొద‌లైన వాటిపై మినహాయింపు క్లెయిమ్ చేసుకునే వీలుంది. ఇలా అన్ని మార్గాల్లో మిన‌హాయింపులు లెక్కించిన త‌ర్వాత తగ్గిన ఆదాయంపై వ‌ర్తించే స్లాబ్ రేటు ప్ర‌కారం ఎంత ప‌న్ను చెల్లించాలో లెక్కించాలి.*

*అలాగే కొత్త ప‌న్ను విధానం (New Tax Regime).. ఇందులో ఎటువంటి మిన‌హాయింపులూ త‌గ్గింపులూ అనుమ‌తించరు కాబ‌ట్టి ప‌న్ను చెల్లింపుదారులు వారికి వ‌ర్తించే స్లాబ్ రేటు ప్ర‌కారం చెల్లించాల్సిన ప‌న్నును లెక్కించి ఏ విధానంలో ఎక్కువ లాభం పొందుతున్నారో తెలుసుకోవాలి. త‌ద‌నుగుణంగానే ఎవ‌రికి వారు వారికి స‌రిపోయే ప‌న్ను వ్య‌వ‌స్థ‌ను ఎంపిక చేసుకోవాలి. ఉదాహ‌ర‌ణకు ర‌మేష్‌, రాజేష్‌, సురేష్ ముగ్గురూ ఉద్యోగం చేస్తున్నారు. వీరి వార్షిక ఆదాయం, పెట్ట‌బుడుల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని, ఎవరికి ఏ విధానం అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..*

*కేస్‌..1: ర‌మేష్ వార్షిక ఆదాయం రూ.8.50 ల‌క్ష‌లు, అత‌డి వార్షిక పెట్టుబ‌డులు ఇవీ..*

*పాత, కొత్త ప‌న్ను విధానాల్లో ర‌మేష్‌కు ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుందంటే..?*

*పై ఉదాహ‌ర‌ణ‌లో ర‌మేష్ ఆదాయం, పెట్టుబ‌డుల‌ ఆధారంగా లెక్కిస్తే పాత‌ ప‌న్ను విధానంతో పోలిస్తే.. కొత్త‌ ప‌న్ను విధానంలో చెల్లించాల్సిన ప‌న్ను రూ. 2 వేలు త‌గ్గుతుంది. కాబ‌ట్టి ఇక్క‌డ ర‌మేష్ కొత్త‌ ప‌ద్ధ‌తిని ఎంచుకోవ‌డం మంచిది. ఇక్క‌డ ర‌మేష్ ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌పై అంత‌గా దృష్టి సారించ‌లేద‌నే చెప్పాలి. ఒక‌వేళ ప‌న్ను ఆదా పెట్టుబ‌డులను పెంచుకున్న‌ట్లయితే పాత ప‌ద్ధ‌తే మెరుగ్గా ఉండేది.*

*ఉదాహ‌ర‌ణ‌కు సెక్ష‌న్ 80సి తీసుకుంటే గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. కానీ ఇక్క‌డ ర‌మేష్ రూ.70 వేల వ‌ర‌కు మాత్ర‌మే మినహాయింపు పొందుతున్నాడు. ఒక‌వేళ సెక్ష‌న్ 80సి కింద పూర్తి మిన‌హాయింపు పొంద‌గ‌లిగితే ప‌న్ను చెల్లింపు రూ.38,500కి త‌గ్గేది. అప్పుడు పాత ప‌ద్థ‌తిని ఎంచుకుని ఫైల్ చేయ‌డం ద్వారా రూ.14 వేలు ఆదా చేసుకోగ‌లిగేవారు. ఇదే ప‌న్ను ఆదా పెట్టుబడుల వ‌ల్ల ప్ర‌యోజ‌నం.*

*కేస్‌..2: రాజేష్‌ వార్షిక ఆదాయం రూ. 14 ల‌క్ష‌లు. అత‌డి  వార్షిక పెట్టుబడులు ఇవీ..*

*పాత, కొత్త ప‌న్ను విధానాల‌లో రాజేష్‌కు ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుందంటే..?*

*ఇక్క‌డ రాజేష్ పాత విధానంలో రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం వ‌ల్ల రూ.8 వేల వ‌ర‌కు ఆదా చేయ‌గ‌లుగుతున్నాడు. ఒక‌వేళ రాజేష్‌కు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ త‌ప్ప ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు లేవు అనుకుందాం. అటువంట‌ప్పుడు.. పాత విధానం ఎంచుకుంటే చెల్లించాల్సిన ప‌న్ను (రూ.12500 (రూ. 5 ల‌క్ష‌ల వ‌రుకు) + రూ.1,00,000 (రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు) + రూ. 1,05,000 (ఆపై రూ.3.50 ల‌క్ష‌లకు 30 శాతం పన్ను) = రూ.2,17,500 చేరుతుంది. ఈ సంద‌ర్భంలో కొత్త ప‌ద్ధ‌తిని ఎంచుకుంటే రూ. 1,62,500 చెల్లించాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి కొత్త ప‌ద్ధ‌తిని ఎంచుకోవ‌డం ద్వారా రూ. 55,000 ఆదా చేసుకోవ‌చ్చు.*

*కేస్‌..3:  సురేష్‌ వార్షిక ఆదాయం రూ.20 ల‌క్ష‌లు.. అత‌డి వార్షిక పెట్టుబ‌డులిలా ఉన్నాయి..*

*పాత, కొత్త ప‌న్ను విధానాల‌లో సురేష్‌కు ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుందంటే..*

*సురేష్‌ ఆదాయం, పెట్టుబ‌డుల‌ను ఆధారంగా లెక్కిస్తే.. కొత్త‌ ప‌న్ను విధానంతో పోలిస్తే.. పాత‌ ప‌న్ను విధానంలో చెల్లించాల్సిన ప‌న్ను రూ. 30,000 వ‌ర‌కు త‌గ్గుతుంది. కాబ‌ట్టి ఇక్క‌డ సురేష్ పాత‌ ప‌ద్ధ‌తిని ఎంచుకోవ‌డం మంచిది.*

*పై ఉదాహ‌ర‌ణ‌ల‌ను గ‌మ‌నిస్తే ఆదాయంలో హెచ్చ‌త‌గ్గులు ఉన్న‌ప్ప‌టికీ, వారి వారి ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌ను అనుస‌రించి వారు ఎంచుకునే ప‌న్ను విధానం మారింది. ఒక్కోసారి పాత ప‌న్ను విధానం లాభ‌దాయ‌కంగా ఉంటే, మ‌రోసారి కొత్త ప‌న్ను విధానం లాభ‌దాయకంగా ఉంది. ప‌న్ను చెల్లింపుదారులు ఏ ప‌ద్ధ‌తిని (పాత, కొత్త విధానాలు) ఎంచుకోవాలనుకుంటున్నారో ముందుగానే మీ సంస్థకు తెలియ‌జేయాలి. కాబట్టి, వారికి తెలిపే ముందే రెండు విధానాల్లోనూ ప‌న్ను లెక్కించి ఏ ప‌ద్ధ‌తి మీకు అనుగుణంగా ఉంటుందో ఈ లెక్క‌లు వేసి తెలుసుకోండి. సాధారణంగా ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు లేని వారు కొత్త విధానాన్ని ఎంచుకోవ‌డం మంచిది.*


TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top