Search This Blog

Saturday, July 23, 2022

High BP | హైబీపీని తగ్గించే సహజ సిద్ధమైన పదార్థాలు..!

High BP | హైబీపీని తగ్గించే సహజ సిద్ధమైన పదార్థాలు..!
ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. ఎక్కువగా టెన్షన్ పడడాన్నే హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అంటారు. సాధారణంగా 140/90 కంటే ఎక్కువ ప్రెషర్ ఉండడాన్నే హైబీపీ అంటారు. 180/90 ఉంటే అరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. అందుకే అలాంటి పరిస్థితి రాకముందే బీపీని కంట్రోల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం.. వంటి అనేక కారణాల వల్ల హైబీపీ వస్తుంది. నిత్యం కొన్ని ఆహారాలను మన ప్లేట్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ ఆహారపదార్థాలు ఏవంటే..!

దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది. తేనె, దాల్చినచెక్క పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే హైబీపీతోపాటు పీసీవోడీ, డయాబెటిస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.
అవిసె గింజెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసెగింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకుని కూడా తినవచ్చు.
యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోడం ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
వెల్లుల్లి హైబీపీని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
అధిక రక్తపోటుకు గల కారణాలలో సోడియం ఒకటి. అరటిలో లభించే అధిక పొటాషియం కంటెంట్ సోడియం చెడు ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
బ్లూబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆంథోసైనిన్స్ అని పిలువబడే ఫ్లవనాయిడ్లను కలిగి ఉండి హైబీపీ రాకుండా చూస్తాయి.
డార్క్ చాక్లెట్లను తినడం వల్ల కూడా అధిక రక్త పోటు సమస్యను అధిగమించవచ్చు.
అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు తృణధాన్యాల పిండి, గోధుమ పిండి, ఓట్స్‌ పిండి, బక్వీట్‌ పిండి, బార్లీ పిండితో చేసిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top