Search This Blog

Monday, July 25, 2022

బిపి ఎక్కువ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

బిపి ఎక్కువ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


బిపి ఎక్కువ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ప్రశ్న: నాకు అరవై ఏళ్లు. అధిక రక్తపోటు ఉంది. ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

- విభీషణరావు, హైదరాబాద్‌

డాక్టర్ సమాధానం: అధిక రక్తపోటు ఉన్నవారు ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే, కాస్త తగ్గినా కూడా నియంత్రణలోకి వస్తుంది. ఆహారంలో సోడియం లేదా ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రోజూ తీసుకునే పప్పు, కూరలలో ఉప్పు తగ్గించాలి. ఊరగాయలు, పచ్చళ్ళు, ఉప్పు కలిపి చేసే పిండి వంటలు, చిరుతిళ్ళు మానెయ్యాలి. మీ ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వారానికి నాలుగు రోజులు ఆకుకూరలు తినాలి. అధిక రక్తపోటు చాలా కాలం నియంత్రణలో లేకపోతే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆహారంలో సాచురేటెడ్‌ కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధిక నూనెలో వేయించిన వేపుళ్ళు, చిరుతిళ్ళు, బేకరీ ఫుడ్స్‌ లాంటి వాటికి దూరంగా ఉండండి. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే సరైన ఆహార నియమాలతో పాటు రోజూ వ్యాయామం కూడా ముఖ్యం. 

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top