Search This Blog

Sunday, July 17, 2022

ఇక కార్డుతో పనిలేదు 🔊 ఇప్పుడు డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎంల నుంచిడబ్బులు పొందొచ్చు... 🔊అన్ని ఏటీఎంలలో కార్డు రహిత నగదు 🔊 బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లకు ఆర్బీఐ ఆదేశాలు👇

🔊 ఇక కార్డుతో పనిలేదు
🔊 ఇప్పుడు డెబిట్ కార్డ్
లేకుండానే ఏటీఎంల నుంచిడబ్బులు పొందొచ్చు...
🔊అన్ని ఏటీఎంలలో కార్డు రహిత నగదు                      🔊 బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లకు ఆర్బీఐ ఆదేశాలు👇                                          

ఏటీఎంలలో వినియోగదారులకు కార్డు రహిత నగదు ఉపసంహరణల సదుపాయాన్ని కల్పించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లకు గురువారం ఆదేశాలిచ్చింది. ఇందుకోసం బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్‌లతో కలిసి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఇంటెగ్రేషన్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థ నేషనల్‌ పేమేంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కూ సూచించింది. కార్డ్‌-లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ-ఇంటరాపరబుల్‌ కార్డ్‌-లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌) సమయంలో కస్టమర్‌ ఈ యూపీఐని వినియోగిస్తారు. ఆపై నేషనల్‌ ఫైనాన్షియల్‌ స్విచ్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌)/ఏటీఎం నెట్‌వర్క్స్‌ ద్వారా లావాదేవీల ప్రక్రియ పూర్తవుతుందని ఆర్బీఐ ఈ సందర్భంగా పేర్కొన్నది.

ఎటువంటి చార్జీల్లేవ్‌

ఈ కార్డ్‌-లెస్‌ క్యాష్‌ లావాదేవీలపై సూచించినవి కాకుండా ఏ చార్జీలుండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే ఈ ఐసీసీడబ్ల్యూ లావాదేవీల కోసం విత్‌డ్రాయల్‌ పరిమితులు.. సాధారణ ఏటీఎం విత్‌డ్రాయల్స్‌కు ఉన్నవేనని తెలియజేసింది. విఫలమైన లావాదేవీల కోసం హార్మనైజేషన్‌ ఆఫ్‌ టర్న్‌ అరౌండ్‌ టైం (టీఏటీ), కస్టమర్‌కు నష్టపరిహారానికి సంబంధించి ఇతర అన్ని సూచనలూ ఎప్పట్లాగే ఉంటాయన్నది.

కార్డు రహిత నగదు ఉపసంహరణ అంటే?
ఏటీఎంల నుంచి డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు లేకుండానే నగదును తీసుకునే సౌలభ్యమే ఈ కార్డు రహిత నగదు ఉపసంహరణ. నిజానికి కరోనా నేపథ్యంలో ఏటీఎంలకు వెళ్లడానికి ఇష్టపడని వారికోసం ఆయా బ్యాంకులు ఇప్పటికే తమ ఏటీఎంలలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, బీవోబీ తదితర బ్యాంకులు ఈ తరహా సేవల్ని కల్పిస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లకు ఈ సదుపాయాన్ని ఇప్పుడు ఆర్బీఐ తప్పనిసరి చేసింది. దీంతో స్కిమ్మింగ్‌, కార్డ్‌ క్లోనింగ్‌, డివైజ్‌ టాంపరింగ్‌ వంటి ఏటీఎం మోసాలకూ చెక్‌ పడుతుందని ఆర్బీఐ భావిస్తున్నది. కస్టమర్లు తమ మొబైల్‌ ఫోన్లలో వచ్చే పిన్‌ ద్వారా నగదును ఉపసంహరించుకునే అవకాశముండటమే ఇందుకు కారణం. కాగా, ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సదుపాయాన్ని కస్టమర్లకు అందివ్వడం లేదు. పైగా రోజువారీ లావాదేవీ పరిమితులున్న విషయం తెలిసిందే. బ్యాంకునుబట్టి రూ.10,000-20,000లుగా ఇవి ఉన్నాయి. ఇక కొన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి అదనపు లావాదేవీలకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలతో ఇవన్నీ మారిపోనున్నాయి. ఖాతాదారులు ఆయా బ్యాంకుల మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ సౌకర్యం కోసం విజ్ఞప్తి చేసుకోవచ్చు.*🔊💳ఇప్పుడు డెబిట్‌ కార్డ్‌ లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులు పొందొచ్చు...*

*🍥డీమానిటైజేషన్‌ ప్రభావం వల్ల డిజిటల్‌ చెల్లింపులకి ఆదరణ పెరిగింది. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా డిజిటల్‌ ప్లాట్‌ఫాంల వేదికగా ద్రవ్య లావాదేవీలు సాగించారు. వాస్తవానికి 2010 నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నా ప్రజలు అంతగా మక్కువ చూపలేదు. డీమానిటైజేషన్‌ తరువాత 2016 నుంచి ఈ విధానం ఊపందుకుంది. అ సంప్రదాయానికి కొనసాగింపుగా రకరకలా యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్డ్‌లెస్‌ క్యాష్‌ విధానంలో మరో నూతన అధ్యయనమే యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్‌లతో ఏటీఎంల నుంచి డబ్బులు పొందటం. డెబిట్‌ కార్డ్‌ లేకుండా ఇదేలా సాధ్యమో తెలుసుకుందాం...*

*🌀గూగుల్‌ పే, పేటీయం వంటి వాటిని ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి.... సాధారణంగా ఏటీఎంల నుంచి డబ్బులు పొందడానికి డెబిట్‌ కార్డ్‌ ప్రాథమిక మార్గం. అయితే తాజాగా ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఏటీఎంను ఆప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి ఇంటరోపర్‌బుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రా (ఐసీసీడబ్ల్యూ) ( డెబిట్‌ కార్డ్‌ అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు పొందే విధానం). దీనితో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు నుంచి యూపీఐని ఉపయోగించి డబ్బులు తీసుకోవడానికి ఈ విధానం అనుమతిచ్చేలా దీనికి సంబంధించిన సాప్ట్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తారు. తమ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులుమరచిపోయినా, కాలం చెల్లిన కార్డులు పనిచేయకపోయినా, దొంగతనానికి గురైన సందర్భాల్లో ఈ విధానం ఉపయోగపడుతుంది.*



*💥తప్పనిసరిగా ఉండాల్సినవి:*

*➡️ఈ సేవను వినియోగించుకోడానికి యూపీఐతో కూడిన ఏటీఎం మెషిన్‌ అందుబాటులో ఉండాలి.*
 
*➡️ఇంటర్నెట్ కనెక్షన్‌ తప్పనిసరిగా ఉండాలి.*

*➡️వినియోగదారుడి ఫోన్‌లో ఏదైనా యూపీఐ చెల్లింపుల అప్లికేషన్‌ (ఫోన్‌ పే, గుగూల్‌ పే, పేటీఎం,అమెజాన్‌ పే) ఉండాలి.* 

*💥డబ్బులు తీసుకునే విధానం*

*➡️1. ఏదైనా ఏటీఎం దగ్గరకు వెళ్లి నగదు విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.*

*➡️2. తర్వాత స్క్రీన్‌లో యూపీఐ విత్‌డ్రాను క్లిక్‌ చేయాలి.*

*➡️3. ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ చూపిస్తుంది.*

*➡️4. ఖాతాదారుడి ఫోన్‌లో ఏదైనా యూపీఐ ఆధారిత చెల్లింపు యాప్‌ని తెరిచి, క్యూఆర్ కోడ్‌ని ఆన్ చేయండి*

*➡️5. కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, మీరు ఉపసంహరించుకోవాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు* *చేయండి(ప్రస్తుతం పరిమిత మొత్తం*
*రూ. 5 వేలు)*

*➡️6. డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రోసీడ్ నొక్కి, పిన్‌ని నమోదు చేయండి.*

*💠అంతే ఇలా తేలికగా మీ యూపీఐ చెల్లింపుల యాప్‌లను ఉపయోగించి అత్యవసర పరిస్థితుల్లో సులభంగా డబ్బులు పొందవచ్చు.*


TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top