వానాకాలంలో వీటిని తింటే జలుబు, జ్వరాన్ని తరిమేయవచ్చు .
Monsoon diet: వానాకాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వాతావరణం మార్పు అవుతున్న కొద్దీ ఒక్కొక్కరిని అనారోగ్యం చుట్టు ముడుతుంది. చాలా మందికి జలుబు పెద్ద సమస్యగా మారుతుంది. ఈ కాలంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు, జ్వరం వెంటనే వచ్చేస్తాయి. ఈ వర్షాకాలంలో పలు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
వానాకాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్ జోలికి అస్సలే వెళ్లకూడదు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం నుండి తట్టుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలి.
1. అల్లం
వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి వల్ల జలుబు, దగ్గు లాంటి రోగాల నుండి బయట పడవచ్చని చెబుతున్నారు. అల్లం తీసుకుంటే మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వానాకాలంలో తప్పక తీసుకోవాల్సిన వాటిలో అల్లం కూడా ఒకటి. అల్లం తినడం వల్ల జలుబు నుండి రిలీఫ్ పొందవచ్చు. అల్లం ఛాయ్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. కూరల్లో వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం అవుతుంది.
2. కొబ్బరి నీళ్లు
ఎండాకాలంలోనే కాదు వానాకాలంలోనూ డిహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా దాహం వేయదు. అందుకని చాలా మంది తక్కువగా నీరు తాగుతుంటారు. తక్కువ నీటిని తాగడానికి మరో కారణం.. పదే పదే బాత్రూమ్కు వెళ్లాల్సి వస్తుందని.. తక్కువ నీళ్లు తాగుతుంటారు. ఇలా తక్కువ నీళ్లు తాగితే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొబ్బరి నీళ్ల తాగితే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఎప్పుడూ హైడ్రేషన్ గా ఉండేందుకు ఇవి చక్కగా పని చేస్తాయి. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ అన్ని రకాలుగా మంచివి.
3. సూప్
వానాకాలంలో వేడి వేడి సూప్ తాగుతుంటే చాలా బాగుంటుంది. గోరు వెచ్చని సూప్ తాగడం వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ లాంటి సమస్యల నుండి బయట పడవచ్చు. సూప్ త్వరగా జీర్ణం అవుతుంది. సూప్ లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి.
సూప్ ను చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వెజ్ సూప్స్, చికెన్ సూప్స్, గార్లిక్ సూప్స్ ఇలా పలు రకాల సూప్స్ ను ట్రై చేయవచ్చు. ఇందులోకి కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకుంటే ముక్కు దిబ్బడ నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మసాలాలు కలిపినా చక్కని ప్రయోజనం ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి సూప్ తయారీ అని కొడితే వేలల్లో రిజల్ట్స్ వస్తాయి. దేనినైనా ఒకదాన్ని ఫాలో అయితే మంచి నోరూరించే సూప్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని బయటకు వెళ్లాల్సిన పని కూడా తప్పుతుంది.
4. వెల్లుల్లి
వెల్లుల్లి మంచి ఆరోగ్య ప్రధాయిని. ఇది కేవలం రుచిని అందివ్వడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది వెల్లుల్లి. వెల్లుల్లిలోని ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలిసి ఉండదు. కూరల్లో రుచి కోసమే వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇవి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. వెల్లుల్లి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పోషకాహార వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిని కూరల్లో భాగం చేసుకుని రోజూ తీసుకుంటే... ఇమ్యూనిటీ పెరగడంతో పాటు జలుబు, ఫ్లూ వంటి సమస్యల్ని తరిమి కొట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రోటీన్ ఫుడ్స్
వానాకాలంలో ప్రోటీన్ ఫుడ్స్ చాలా మేలు చేస్తాయి. సాల్మన్ చేపలు, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవి శరీర జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. అనవసరమైన కొవ్వును కరిగించడంలో చేపల్లో విటమిన్లు ఉపయోగపడతాయి. వానాకాలంలో దొరికే పండ్లను తీసుకోవాలి.
ఈకాలంలో వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. కొంత చలిగా ఉంటుంది కాబట్టి వేడి భోజనం చేస్తే ఉపశమనం పొందిన ఫీలింగ్ కలుగుతుంది. వీటితో పాటు జలుబు చేస్తే తరచూ ఆవిరి పట్టుకోవాలి. ఈ విధంగా కూడా జలుబు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.