విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి
గురుకులం స్కూల్ తనిఖీ చేసిన మంత్రి.
సంగారెడ్డి జిల్లా: ఇస్నాపూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ను మంత్రి హరీశ్ రావు తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించి క్యాంపస్ మొత్తం తిరిగి పరిశీలించారు. వంట గది, డైనింగ్ హాల్ ను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజన సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మంత్రి సూచించారు. స్కూల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు మంత్రి హరీశ్ రావు.