Search This Blog

Monday, July 25, 2022

15వ రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ద్రౌప‌ది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

పేద‌లు త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము



పేద‌లు త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

న్యూఢిల్లీ: 15వ రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ద్రౌప‌ది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అత్యున్నత ప‌ద‌వికి ఎన్నిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఉత్స‌వాల వేళ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌కావ‌డం సంతోషంగా ఉందన్నారు. పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగింది. దేశ ప్ర‌జ‌ల విశ్వాసం నిల‌బెట్టుకునేలా పనిచేస్తాన‌న్నారు. దేశంలో మ‌రింత వేగంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉందన్నారు. పేద‌లు కూడా త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు అని త‌న‌తో రుజువైంద‌న్నారు. మీ న‌మ్మ‌కం, మ‌ద్ద‌తు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించేందుకు త‌న‌కు శ‌క్తినిస్తుంద‌న్నారు. భార‌త్‌ స్వాతంత్య్రం సాధించిన త‌ర్వాత పుట్టిన తొలి రాష్ట్ర‌ప‌తిని తానే అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లు అభివృద్ధిలో వేగం పెంచాల‌న్నారు.

రాష్ట్ర‌ప‌తి పోస్టును చేరుకోవ‌డం త‌న వ్య‌క్తిగ‌త ఘ‌న‌త‌గా భావించ‌డం లేద‌ని, ఇది భార‌త్‌లో ఉన్న ప్ర‌తి పేద‌వాడి అచీవ్‌మెంట్ అని, తాను రాష్ట్ర‌ప‌తిగా నామినేట్ అవ్వ‌డం అంటే, దేశంలో పేద‌లు క‌ల‌లు క‌న‌వ‌చ్చు అని, వాళ్లు ఆ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు అని రుజువైంద‌న్నారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న పేద‌లు, ద‌ళితులు, వెనుక‌బ‌డిన‌వాళ్లు, గిరిజ‌నులు, త‌న‌ను ఆశాకిర‌ణంగా చూడ‌వ‌చ్చు అన్నారు. త‌న నామినేష‌న్ వెనుక పేద‌ల ఆశీస్సులు ఉన్నాయ‌ని రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు. కోట్లాది మ‌హిళ‌ల ఆశ‌లు, ఆశ‌యాల‌కు ప్ర‌తిబింబంగా నిలుస్తుంద‌న్నారు.


TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top