Search This Blog

Tuesday, May 10, 2022

విమానంలో ప్రత్యేక అతిథి* #విషయం చదివిన తర్వాత క్రింద వీడియో చూడండి.# సర్‌ఫ్రైజ్‌ ఇచ్చిన పైలెట్‌......

*విమానంలో ప్రత్యేక అతిథి* 
#విషయం చదివిన తర్వాత క్రింద వీడియో చూడండి.#
సర్‌ఫ్రైజ్‌ ఇచ్చిన పైలెట్‌......
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నారు. విశేషం ఏంటంటే చిన్నప్పుడు అతని వద్ద చదువుకున్న విద్యార్థే ఆ ఎయిర్‌లైన్స్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో తనకు చదువు చెప్పిన టీచర్‌, నేడు తాను నడుపుతున్న విమానంలోనే ప్రయాణిస్తుండటంతో ఆ పైలెట్‌ తెగ సంతోషపడ్డాడు. వెంటనే... ‘విమానంలో ఎడమ వైపు నల్లకోటు వేసుకున్న వ్యక్తి నా స్కూల్‌ టీచర్‌. ఒకప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్‌ ఈరోజు నేను నడిపే విమానంలో ప్రయాణిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను.
ఈ సందర్భంగా
'ఆయనకు పువ్వులు ఇచ్చి విష్‌ చేయాల్సిందిగా సిబ్బందిని కోరుతున్నాను’ 
అంటూ ఉద్వేగానికి లోనవుతూ ప్రకటన చేశాడు.
ఈ ప్రకటన విన్న ఆ టీచర్‌కి కన్నీళ్లాగలేదు. 
ఈ లోపు పైలట్‌ చెప్పినట్లుగానే విమానంలోని ఇతర సిబ్బంది ఫ్లవర్‌ బోకేలు ఇచ్చి సదరు టీచర్‌ని  విష్‌ చేశారు. 
ఆ తర్వాత తన టీచర్‌ను కలవడానికి క్యాబిన్‌ నుంచి పైలట్‌ కూడా వచ్చాడు. టీచర్‌ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. 
సదరు పైలట్‌ చేసిన పనికి తోటి ప్రయాణికులకు కూడా కన్నీరాగలేదు. 
చప్పట్లు కొడుతూ పైలట్‌ను అభినందించారు.
 విమానంలోని కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. 
అయితే ఇదే సమయంలో విమానంలో టర్కీకి చెందిన ఇష్టిషమ్‌ ఉల్‌హక్‌ అనే విలేకరి కూడా ఉన్నారు.

ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ...
తనకు చదువు చెప్పిన టీచర్‌ తను నడుపుతున్న విమానంలో ఉన్నారని తెలిసి ఈ పైలట్‌ ఈ రకంగా ధన్యవాదాలు తెలిపారు. 
ఈ దృశ్యం నన్నెంతో కదిలించింది. 
మన జీవితాలకు వెలుగునిచ్చిన ఉపాధ్యాయులకు మనం ఇచ్చే మర్యాద ఇది..’ 
అని పోస్ట్‌ చేశారు. 
 *నా ముందు దైవం, గురువు ఇద్దరూ నిలబడితే, నేను ముందుగా గురువుకు నమస్కారం చేస్తాను.*
ఎందుకంటే ఈ రోజు నాకు భగవంతుని దర్శనం లభించిందంటే అందుకు కారణం గురువు’ అని.
అది ఉపాధ్యాయులకు మనం ఇవ్వాల్సిన గౌరవం. 
*తాము విద్యాబుద్ధులు నేర్పిన వారు నేడు ప్రయోజకులై తమ కళ్లముందుకు వస్తే ఉపాధ్యాయులకి కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేము.* 🙏🙏

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top