*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు*
*MEDICAL REIMBURSEMENT పొందు విధానము.:-*👇
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కు ప్రస్తుతం రెండు పద్ధతులలో వైద్య సేవలు అందుతున్నవి.
మొదటిది *" ఉద్యోగుల ఆరోగ్య పథకం"* (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) ద్వారా నగదు రహిత చికిత్స నిర్దిష్టమైన కార్పొరేట్ హాస్పిటల్స్ ద్వారా మరియు వెల్నెస్ సెంటర్ ల ద్వారా అందిస్తున్నది.
రెండవది గతంలో ఉన్న *"మెడికల్ రీఇంబర్స్మెంట్ స్కీమ్"* . ఇందులో మనం ముందుగా పూర్తిగా మన స్వంత డబ్బు చెల్లించి చికిత్స పొందిన తరువాత అట్టి వైద్య బిల్లులను రీయింబర్స్మెంట్ కొరకు పంపించే విధానం. ఇది *గరిష్టంగా రెండు లక్షల వరకు మాత్రమే చెల్లించబడుతుంది. ప్రస్తుతం ఈ విధానం 31/03/2023 వరకు పొడిగించబడినది*.
(Vide GOMs.No. 33; MH&FW Dept.;. Dt. 15/03/2022)
ఇట్టి రీఇంబర్స్మెంట్ ప్రతిపాదనలు పెన్షనర్లు తాము ఏ కార్యాలయం/ పాఠశాల నుండి పదవీ విరమణ చెందినారో, ఆ సంస్థ డ్రాయింగ్ అధికారి ద్వారా పంపించాల్సి ఉంటుంది.
ఇట్టి రీఇంబర్స్మెంట్ 50,000/- లోపు ఉన్నట్లయితే జిల్లా స్థాయిలోనూ, అంతకుమించి ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయిలో మంజూరు కాబడతాయి. ఈమధ్య ఒక్క విద్యాశాఖకు చెందినవి మాత్రమే ONLINE ద్వారా పంపించాల్సి ఉంటుంది.
ఇందుకుగాను పెన్షనర్ తప్పకుండా ఇన్ పేషెంట్ గా చికిత్స పొందిన వారై ఉండాలి. కొన్ని కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు గతంలో సర్జరీ గావింపబడి, ఫాలో అప్ చికిత్స పొందు అవుట్ పేషెంట్లకు కూడా రియంబర్స్మెంట్ వస్తుంది. ఉదాహరణకు గుండె ఆపరేషన్ మొlI చేయించుకొని ప్రతి ఆరు మాసములకు ఒకసారి ఫాలో అప్ చికిత్స కొరకు చేయించుకునే వైద్య పరీక్షలకు, మందులకు రీయింబర్స్మెంట్ పొందవచ్చును.
*ప్రతిపాదనలు పంపించడానికి ఈ క్రింది సర్టిఫికెట్లు మరియు బిల్లులు అవసరము*.
*హాస్పిటల్ నుండి తీసుకోవలసినవి*:-
1) EMERGENCY CERTIFICATE
2) ESSENTIALITY CERTIFICATE.
3) DISCHARGE SUMMARY.
4) HOSPITAL DETAILED BILL.
5) FINAL BILL RECEIPT.
6) NON- AVAILMENT OF EHS CERTIFICATE.
7) GENUINENESS CERTIFICATE.
(ఇట్టి సర్టిఫికేట్ కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు డ్రాయింగ్ ఆఫీసర్ నుండి అప్లికేషన్ వస్తేనే ఇస్తున్నారు.)
8) HOSPITAL RECOGNITION G.O.copy
9) ORIGINAL BILLS (Pharmacy, Investigations and other bills)
పైన పేర్కొన్న సర్టిఫికెట్లపై మరియు బిల్లులపై చికిత్స చేసిన డాక్టరు సంతకములు మరియు అతని పేరుతో గల ముద్ర వేయించాలి.
ఇట్టి *రీయింబర్స్మెంట్ ప్రతిపాదనలు చికిత్స పొందిన ఆరు మాసములలోగా* సంబంధిత మంజూరు చేయు అధికారికి పంపవలెను. *చికిత్స పొందిన వారు ఒకవేళ మరణించినట్లయితే ఎనిమిది మాసములలో గా పంపుకునే అవకాశం ఉంది.*
ప్రస్తుతం రీఎంబర్స్మెంట్ పరిమితి రెండు లక్షల వరకు మాత్రమే ఉంది. ఇది పెంచాల్సిన అవసరం ఉంది.
*ప్రతిపాదనలు ఈ క్రింది నమూనాలలో నింపి పంపాలి* .
1) Forwarding letter
2) Individual application
3) Modified check list
4) Appendix-II
5) Non-drawal certificate.
6) Spell claim certificate.
7) Dependent certificate.
(సర్వీస్ పెన్షనర్ స్వయంగా చికిత్స పొందితే ఇది అవసరం లేదు)
8) Pension Payment Order copy (Xerox)
🙏