Search This Blog

Saturday, April 2, 2022

హైకోర్టు ఉత్తర్వులను.. అధికారులు అమలు చేసి తీరాలిలేదంటే అప్పీలుకు వెళ్లాలి8 మంది ఐఏఎస్‌లకు శిక్ష.. తెలుగుజాతి సిగ్గుపడే అంశం ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు.



హైకోర్టు ఉత్తర్వులను.. అధికారులు అమలు చేసి తీరాలి

లేదంటే అప్పీలుకు వెళ్లాలి

8 మంది ఐఏఎస్‌లకు శిక్ష.. తెలుగుజాతి సిగ్గుపడే అంశం


ఐఏఎ్‌సలతో మంత్రులు విభేదిస్తే.. వారి పేరుతోనే జీవోలిచ్చే పద్ధతి రావాలి

రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సీఎంకు అందరూ చెప్పాలి

ఆంధ్రజ్యోతితో మాజీ సీఎస్‌ ఎల్వీ 


అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఒకేసారి ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులకు శిక్ష విధించడం.. తె లుగుజాతి సిగ్గుపడే అంశమని, ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. హైకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చిందంటే దానిని తప్పకుండా అమలుచేయాలని.. లేదంటే అప్పీలుకు వెళ్లొచ్చన్నారు. అంతే తప్ప ఆదేశాలు అమలు చేయం అంటే కుదరదని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో ఈ అంశంపై మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను న్యాయస్థానాలు ప్రతిరోజూ నెరవేరుస్తూనే ఉంటాయి. రాజ్యాంగాన్ని పరిక్షరిస్తామనే ఐఏఎ్‌సలు బాధ్యతలు తీసుకుంటారు. యూపీఎస్సీలో ఎంపికైంది కూడా అందుకే. ముఖ్యమంత్రి, మంత్రులు సైతం తాము రాజ్యాంగం ప్రకారం వెళ్తున్నామా లేదా అన్నది గమనించుకోవాలి. తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఈరోజు వింతపోకడ ఏంటంటే.. తీర్పులతో పాటు న్యాయమూర్తులనూ కించపరిచేలా మాట్లాడడం. ఇది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడమే. ఉదాహరణకు ఈ కేసు చూస్తే.. పాఠశాలలో గ్రామ సచివాలయం నిర్మిస్తున్నారు.

నిర్మించకూడదని తల్లిదండ్రులు న్యాయస్థానానికి వెళ్లారు. కోర్టు కట్టొద్దన్నా.. అధికారుల అలసత్వం వల్లే అక్కడ నిర్మాణం జరిగింది. అలసత్వం ఏ స్థాయిలో ఉన్నా.. ఆ గొలుసులో ఉన్నవారంతా సమాన భాగం తీసుకోవాలి. ఒకవేళ కోర్టు తీర్పుపై అభ్యంతరాలుంటే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లొచ్చు అని తెలిపారు. శాఖలకు కార్యదర్శులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారులు ఒక విషయాన్ని ఫైల్‌ రూపంలో పంపిస్తే.. దానికి మంత్రి అంగీకరించనప్పుడు ఏం చేయాలన్నదానిపై బిజినెస్‌ రూల్స్‌ స్పష్టంగా చెబుతున్నాయని వెల్లడించారు. హైకోర్టు పాఠశాలలో సచివాలయ నిర్మాణం చేయొద్దందంటూ మంత్రికి ఫైలు పంపించవచ్చు. మంత్రి దానితో విభేదిస్తే ముఖ్యమంత్రికి రెండోసారి ఫైలు పంపించవచ్చు. మంత్రి, ముఖ్యమంత్రి కూడా విభేదించి.. తాము చెప్పినట్లే ఉత్తర్వులివ్వాలని స్పష్టం చేస్తే.. అప్పుడొక పద్ధతి ఉంది. తాను పంపిన ఫైలుకు మంత్రి, ముఖ్యమంత్రి అంగీకరించకపోతే.. అందులో న్యాయస్థానం ఉత్తర్వులున్నాయని చెప్పినా వినకుంటే.. అదే విషయాన్ని పేర్కొంటూ ఉత్తర్వులివ్వాలి. లేదంటే కార్యదర్శితో మంత్రి విభేదించినప్పుడు మంత్రి పేరుమీదే ఆదేశాలు ఇచ్చే పద్ధతి రావాలి. అప్పుడు మంత్రులే కోర్టుకు జవాబుదారీ అవుతారు.

రాజ్యాంగమంటే ఏంటో వారికి తెలుస్తుంది. ఇప్పుడు ఎంతమంది మంత్రులకు రాజ్యాంగం తెలుసో అందరికీ తెలిసిన విషయమే అని వ్యాఖ్యానించారు. ఎవరైనా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిందేనని, ఉల్లంఘనకు పాల్పడితే శిక్ష తప్పదనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు. నేనేదో ఆరడుగుల పొడుగుండబట్టి ఐఏఎస్‌ పోస్టింగ్‌ రాలేదు. అదేవిధంగా ఎవరో 60 కిలోల బరువున్నారని మంత్రి పదవి ఇవ్వలేదు. అంతా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి అని స్పష్టంచేశారు.పెట్టే బేడా సర్దుకుని పోవడమే..అధికారులు రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఉత్తర్వులిచ్చి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందనే భావన ఉంది కదా అని ప్రశ్నించగా.. ఏ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చినా విస్మరించడానికి వీల్లేదని ఎల్వీ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిపాలన ఈ రాష్ట్రంలో దుర్లభం అన్నది నిరూపణ అయితే అంతా పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోవడమే. అక్కడ రాష్ట్రపతి పాలన విధించడమే. ఎందుకంటే ముఖ్యమంత్రిని, మంత్రులను ఎన్నుకున్నది.. అధికారులను నియమించేది రాజ్యాంగాన్ని అమలుచేయడానికి. అంతేతప్ప నాకు కలలో ఎవరో చెప్పారు.. నాకు తెలిసింది ఇదే.. నేను ఇదే చదివానంటే కుదరదు. రాజ్యాంగ ఉల్లంఘన చేయడం, హైకోర్టు ఆదేశాలు అమలుచేయకపోవడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. సీఎ్‌సకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తీర్పు నచ్చకపోతే అప్పీలుకు వెళ్లండి. అంతేతప్ప వేరేగా వ్యవహరించొద్దు. ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధ పాలనపై నమ్మకం లేనప్పుడు ఆ పదవి కోల్పోవడం చాలా సులభం. అలా కోల్పోకూడదని నా ఉద్దేశం. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సీఎస్‌ సహా అందరూ ముఖ్యమంత్రికి చెప్పాలి అని పేర్కొన్నారు.


https://m.andhrajyothy.com/amp/telugunews/presidential-rule-ngts-andhrapradesh-1822040103543548









TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top