Search This Blog

Saturday, April 30, 2022

గ్రూప్‌ -1 రిజర్వేషన్లపైఅబద్ధపు ప్రచారం

  • రోస్టర్‌పై అవగాహన లేకుండా తప్పుడు వ్యాఖ్యలు
  • నిబంధనల ప్రకారమే పోస్టుల కేటాయింపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (నమస్తే తెలంగాణ): టీఎస్‌పీఎస్సీ జారీచేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై సోషల్‌ మీడియా సహా కొన్ని మీడియా సంస్థల్లో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. పోస్టుల విభజనపై కొంత మంది అబద్ధాలు వల్లె వేస్తున్నారు. రోస్టర్‌ విధానంపై అవగాహన లేకుండా తప్పుడు ప్రచారంతో ఉద్యోగార్థులను గందరగోళంలోకి నెడుతున్నారు. కోర్టు కేసులతో కాలయాపన చేసేందుకు ఇలా చేస్తున్నారని వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. కానీ, ఇదంతా ఉత్తదేనని అధికారులు చెప్తున్నారు. ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రోస్టర్‌ను ప్రకటించింది. ఆ రోస్టర్‌ ప్రకారమే పోస్టులను భర్తీ చేసేలా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న అంశాలు.. వాస్తవాలు ఇలా ఉన్నాయి.

తప్పుడు ప్రచారం..

బీసీ -ఏకు 7 శాతం పోస్టులు అంటే 35 పోస్టులు రావాల్సి ఉండగా, 37 పోస్టులు కేటాయించారు.

బీసీ – బీ 10 శాతం అంటే 50 పోస్టులు రావా ల్సి ఉండగా 31 పోస్టులు కేటాయించారు.

బీసీ -సీ 1 శాతం అంటే 5 పోస్టులు రావాల్సి ఉండగా 13 పోస్టులు కేటాయించారు.

బీసీ – డీ 7 శాతం 35 శాతం పోస్టులు రావా ల్సి ఉండగా, 21 పోస్టులు కేటాయించారు.

ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం అంటే 50 పోస్టులు రావాల్సి ఉండగా, 43 పోస్టులు కేటాయించారు.

ఎస్సీలకు 15 శాతం అంటే 75 పోస్టులకు 81 పోస్టులు కేటాయించారు.

ఎస్టీలకు 7.5 శాతం అంటే 37 పోస్టులుంటే 31 పోస్టులే కేటాయించారు.

వికలాంగులకు 4 శాతం అంటే 20 పోస్టులు రావాల్సి ఉండగా, 24 పోస్టులు ఇచ్చారు. గ్రూప్‌-1 కేసులపాలై కాలయాపన చేసేందుకే ఇలా రిజర్వేషన్లు తప్పుగా ప్రకటించారు.


ఇదీ వాస్తవం..

పోస్టుల భర్తీలో రోస్టర్‌ రిజర్వేషన్‌ కోసం మొత్తం 503 పోస్టులను కలిపి చూడకూడదు. శాఖల వారీగా పోస్టు, మల్టీజోన్‌-1, 2కు కేటాయించిన పోస్టులను బట్టి రిజర్వేషన్‌ను విభజిస్తారు. కాబట్టి పైన పేర్కొన్నట్టు అస్సలు చూడకూడదు.


ఉదాహరణ ఇలా..

రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టు మల్టీజోన్‌-2లో 1 పోస్టు ఉన్నది. ఈ పోస్టును ఎవరికి కేటాయించాలన్నది ప్రశ్న. రోస్టర్‌ ప్రకారం మొదటి పోస్టు జనరల్‌ మహిళకు వెళ్లాల్సి ఉంటుంది. పైన ఉదహరించిన ప్రకారం వంద శాతం వాటా మహిళలకు దక్కినట్టే అనుకోవాలి. కానీ ఇది అవాస్తవం. మల్టీజోన్‌-2లో మొత్తం 100 పోస్టులుంటే 33 శాతం ప్రకారం 33 పోస్టులు మహిళలకు దక్కడమే కాకుండా, ఎవరి రిజర్వేషన్‌ కోటా ప్రకారం వారికి వస్తాయి. ఉన్నది ఒకే పోస్టు కావటంతో రోస్టర్‌ను అనుసరించి జనరల్‌ మహిళకు కేటాయించారు. మరో 30 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్‌ ఇస్తే, అప్పుడు 2వ రోస్టర్‌ పాయింట్‌ నుంచి మొదలుపెట్టి 30వ రోస్టర్‌ పాయింట్‌ వరకు ఉన్న రిజర్వేషన్‌ ప్రకారం కేటాయిస్తారు. వంద పోస్టులు భర్తీ అయ్యే వరకు ఇలాగే కొనసాగుతుంది. వంద పోస్టులు భర్తీ అయ్యాక తిరిగి రోస్టర్‌-1 ప్రకారం ఆ పోస్టును తిరిగి జనరల్‌ మహిళకు కేటాయిస్తారు.


తప్పుడు ప్రచారం..

మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించి పురుషులకు అన్యాయం చేశారు. మొత్తం 503 పోస్టులకు 33 శాతం అంటే 166 పోస్టులు కేటాయించాల్సి ఉండగా, 255 పోస్టులు కేటాయించారు. దీంతో పురుషులకు అన్యాయం జరుగుతుంది.


ఇదీ వాస్తవం..

ఈ ఏడాది కొత్త రోస్టర్‌ ప్రారంభమైంది. స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ రూల్స్‌ ప్రకారం.. ప్రతి శాఖలో మొదటి పోస్టును ఓసీ మహిళ, రెండో పోస్టు ఎస్సీ మహిళ, మూడో పోస్టు ఓసీ, నాలుగో పోస్టు బీసీ ఏ-మహిళ, 5వ పోస్టు ఓసీ, 6వ పోస్టు వికలాంగ మహిళ ఇలా రోస్టర్‌ను కేటాయించారు. తక్కువ పోస్టులున్న శాఖల్లో ఈ రోస్టర్‌ను అనుసరించటం వల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి.


తప్పుడు ప్రచారం..

స్పోర్ట్స్‌ కోటాలో 2 శాతం అంటే మొత్తం 503 పోస్టులకు 10 పోస్టులు రావాల్సి ఉండగా, 1 పోస్టు మాత్రమే ప్రకటించారు.


ఇదీ వాస్తవం..

రోస్టర్‌ ప్రకారం 48 పోస్టులకు ఒకటిమాత్రమే స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేస్తారు. 98 పోస్టుల వరకు వస్తేనే రెండో పోస్టు కేటాయిస్తారు. ఆ లోపు పోస్టులున్న శాఖల్లో స్పోర్ట్స్‌ కోటా ఉండదు.


ఉదాహరణ..

మల్టీజోన్‌-1లో ఎంపీడీవో 72 పోస్టులుంటే 48 రోస్టర్‌లో స్పోర్ట్స్‌ కోటాలో ఒక పోస్టును కేటాయించారు. అదే మల్టీ జోన్‌-2లో మొత్తం పోస్టులు 49 పోస్టులుండగా, బ్యాక్‌ల్యాగ్‌ (క్వారీఫార్వర్డ్‌) 5 పోస్టులుండటంతో వాటిని మినహాయించటం వల్ల 44 పోస్టులే అయ్యాయి. దీంతో స్పోర్ట్స్‌ కోటా వరకు రాకుండానే రోస్టర్‌ ముగిసింది. మిగతా ఏ శాఖల్లో మల్టీ జోన్‌-1, జోన్‌-2లో 48 పోస్టులు లేకపోవడంతోనే 503 పోస్టుల్లో ఒకటే పోస్టు స్పోర్ట్స్‌ కోటాలో వచ్చింది. తదుపరిలో గ్రూప్‌-1 రిక్రూట్‌మెంట్‌లో మల్టీజోన్‌-2లో 4 ఎంపీడీవో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తే, అప్పుడు ఒక పోస్టు స్పోర్ట్స్‌ కోటాలో దక్కుతుంది.


1 నుంచి 100 పోస్టుల భర్తీ రోస్టర్‌

1 నుంచి 100 పోస్టుల భర్తీకి అనుసరించే రోస్టర్‌ విధానం కింది విధంగా ఉంటుంది. ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టుల వారీగా రోస్టర్‌ను అనుసరిస్తారు. శాఖల వారీగా రోస్టర్‌ ఎక్కడ ఆగిపోతే తదుపరి రిక్రూట్‌మెంట్‌ సమయంలో అక్కడి నుంచే కొత్త రోస్టర్‌ ప్రారంభమవుతుంది.

1వ పోస్టు:ఓసీ (మహిళ)

2వ పోస్టు: ఎస్సీ (మహిళ)

3వ పోస్టు: ఓసీ

4వ పోస్టు: బీసీ -ఏ (మహిళ)

5వ పోస్టు: ఓసీ

6వ పోస్టు: విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌(మహిళ)

7వ పోస్టు:ఎస్సీ

8వ పోస్టు: ఎస్టీ (మహిళ)

9వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

10వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

11వ పోస్టు: ఓసీ

12వ పోస్టు: ఓసీ (మహిళ)

13వ పోస్టు: ఎక్స్‌సర్వీస్‌మెన్‌ /ఓసీ

14వ పోస్టు: బీసీ -సీ

15వ పోస్టు: ఓసీ

16వ పోస్టు: ఎస్సీ

17వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ)

18వ పోస్టు: బీసీ -డీ (మహిళ)

19వ పోస్టు: బీసీ -ఈ (మహిళ)

20వ పోస్టు: బీసీ (ఏ)

21వ పోస్టు: ఓసీ

22వ పోస్టు: ఎస్సీ (మహిళ)

23వ పోస్టు: ఓసీ (మహిళ)

24వ పోస్టు: బీసీ (బీ)

25వ పోస్టు: ఎస్టీ

26వ పోస్టు: ఓసీ

27వ పోస్టు: ఎస్సీ

28వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

29వ పోస్టు: బీసీ -ఏ

30వ పోస్టు: ఓసీ (మహిళ)

31వ పోస్టు: హియరింగ్‌ హ్యాండిక్యాప్డ్‌

32వ పోస్టు: ఓసీ

33వ పోస్టు: ఎస్టీ

34వ పోస్టు: ఓసీ (మహిళ)

35వ పోస్టు: బీసీ (బీ)

36వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

37వ పోస్టు: ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ /ఓసీ

38వ పోస్టు: ఓసీ (మహిళ)

39వ పోస్టు: బీసీ -డీ

40వ పోస్టు: ఓసీ

41వ పోస్టు: ఎస్సీ

42వ పోస్టు: ఓసీ

43వ పోస్టు: బీసీ -డీ

44వ పోస్టు: బీసీ -ఈ

45వ పోస్టు: బీసీ – ఏ(మహిళ)

46వ పోస్టు: ఓసీ

47వ పోస్టు: ఎస్సీ (మహిళ)

48వ పోస్టు: స్పోర్ట్స్‌

49వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

50వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ)

51వ పోస్టు: ఓసీ

52వ పోస్టు: ఎస్సీ

53వ పోస్టు: ఓసీ

54వ పోస్టు: బీసీ – ఏ

55వ పోస్టు: ఓసీ (మహిళ)

56వ పోస్టు: ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్‌

57వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

58వ పోస్టు: ఎస్టీ (మహిళ)

59వ పోస్టు: ఓసీ (మహిళ)

60వ పోస్టు: బీసీ -బీ

61వ పోస్టు: ఓసీ 

62వ పోస్టు: ఎస్సీ

63వ పోస్టు: ఓసీ

64వ పోస్టు: బీసీ -డీ (మహిళ)

65వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ)

66వ పోస్టు: ఎస్సీ (మహిళ)

67వ పోస్టు: ఓసీ

68వ పోస్టు: బీసీ -డీ

69వ పోస్టు: బీసీ -ఈ

70వ పోస్టు: బీసీ -ఏ

71వ పోస్టు: ఓసీ (మహిళ)

72వ పోస్టు: ఎస్సీ

73వ పోస్టు: ఓసీ

74వ పోస్టు: బీసీ -బీ

75వ పోస్టు: ఎస్టీ

76వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

77వ పోస్టు: ఎస్సీ

78వ పోస్టు: ఓసీ (మహిళ)

79వ పోస్టు: బీసీ – ఏ

80వ పోస్టు: ఓసీ

81వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

82వ పోస్టు: మెంటల్లీ హ్యాండిక్యాప్డ్‌

83వ పోస్టు: ఎస్టీ

84వ పోస్టు: ఓసీ (మహిళ)

85వ పోస్టు: బీసీ -బీ

86వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

87వ పోస్టు: ఎస్సీ (మహిళ)

88వ పోస్టు: ఓసీ

89వ పోస్టు: బీసీ – డీ

90వ పోస్టు: ఓసీ (మహిళ)

91వ పోస్టు: ఎస్సీ

92వ పోస్టు: ఓసీ

93వ పోస్టు: బీసీ -డీ

94వ పోస్టు: బీసీ -ఈ

95వ పోస్టు: బీసీ -బీ

96వ పోస్టు: ఓసీ (మహిళ)

97వ పోస్టు: ఎస్సీ

98వ పోస్టు: స్పోర్ట్స్‌

99వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

100వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌








TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top