ఐసీఎస్‌ఐ కింద రిజిస్టర్ అయి ఉన్నారు.
ఐసీఎస్‌ఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలో నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. నవీ ముంబైలో సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్, రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ సెంటర్‌లు, కోల్‌కతా హైదరాబాద్‌లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 72 చాప్టర్ ఆఫీసులు ఉన్నాయి. అంతేకాకుండా యూఏఈ, యూఎస్‌ఏ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాలో కూడా ఐసీఎస్‌ఐకి సంబంధించిన సెంటర్‌లు ఉన్నాయి.
ఐసీఎస్‌ఐ సభ్యుడిని కంపెనీ సెక్రటరీగా నియమిస్తారు. ఐసీఎస్‌ఐ సభ్యుడిగా కావాలంటే కింది పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ఐసీఎస్‌ఐ మూడు రకాలైన కోర్సులను అందిస్తుంది.
అవి..
1) సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఎస్‌ఈఈటీ)
2) సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్
3) సీఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం
సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఎస్‌ఈఈటీ)
అర్హతలు: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు: రూ.1000/-
పరీక్ష విధానం: ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో బిజినెస్ కమ్యూనికేషన్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఎకనామిక్స్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్‌తోపాటు కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. ఈ పరీక్షను మే 7, 2022న నిర్వహించనున్నారు.
సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్
అర్హతలు: కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఎస్‌ఈఈటీ) ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులు అర్హులు.
ఫీజు: సీఎస్‌ఈఈటీ ఉతీర్ణులైన వారు రూ.8500, డిగ్రీ/ పీజీ విద్యార్థులు రూ.13,500 చెల్లించాలి.
ఈ దశను పూర్తిచేయడానికి రెండు మాడ్యూల్స్ ఉత్తీర్ణులు కావాలి. ఒక్కో మాడ్యూల్‌లో నాలుగు పేపర్లు ఉంటాయి.
సీఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం
అర్హతలు: సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఫీజు: రూ.12000/-
ఈ దశను పూర్తి చేయాలంటే మూడు మాడ్యూల్స్‌లో ఉత్తీర్ణులు కావాలి. ప్రతి మాడ్యూల్‌లో మూడు పేపర్లు ఉంటాయి.
నోట్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, ప్రతిభావంతులకు ఐసీఎస్‌ఐ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫండ్ ట్రస్ట్ ఆర్థిక సాయం చేస్తుంది.
హైదరాబాద్ చాప్టర్ మంచి సౌకర్యాలతో ఏర్పాటైంది. విద్యార్థులకు కావలసిన గైడెన్స్‌ను కూడా ఈ చాప్టర్ అందిస్తుంది.
శిక్షణ
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం పరీక్షలు అనంతరం నెలరోజులపాటు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఈడీపీ) చేయాలి. ఈడీపీలో కూడా 15 రోజులు ప్రత్యక్ష బోధనలో, 15 రోజులు ఆన్‌లైన్ విధానంలో తరగతులు ఉంటాయి. అంతేకాకుండా 21 నెలల ప్రాక్టికల్ శిక్షణ కూడా పూర్తి చేయాలి. శిక్షణ సమయంలో స్టయిఫండ్ చెల్లిస్తారు. విద్యార్థులు రెసిడెన్షియల్ కార్పొరేట్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (సీఎల్‌డీపీ) చేయడం ద్వారా సభ్యత్వం పొందవచ్చు. పని అనుభవం ఉంటే సీఎల్‌డీపీకి మినహాయింపు ఉంటుంది.
నోట్: ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు వచ్చే సంచికలో చూడవచ్చు.