Search This Blog

Friday, March 18, 2022

మానవసేవే మాధవసేవగా తరిద్దాము

మనసుండాలి డబ్బు కాదు

మన వద్ద డబ్బు లేకున్నా ఇతరులకు మనం ఎలా సహాయం  చేయవచ్చో తెలియజేసే సంఘటన.


*ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను.* 


 *బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను.* 


 *పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.* 


       *అప్పుడే.. ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.* 

 

      *హమ్మయ్య.. అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.* 


      *నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది.* 


 *ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.* 


         *ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.* 

     

 *ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.* 


      *‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.* 


     *అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.* 


     *"కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు.* 


 *ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు, ఈ తృప్తి చాలు.* 


 *ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.* 


      *నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే...* 


 *ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.* 


    *మనం ధనవంతులం, స్థితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు.* 


 *ఇచ్చే మనసున్న ఎవరైన "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను.* 


 *ఒకరికి ఇవ్వడంలో గల "సంతృప్తి", మరెందులోనూ రాదని అర్థమైంది* 


 *మిత్రులారా దయచేసి* 


 *సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి.* 


 *మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం.!* 


 *"మానవసేవే మాధవసేవగా తరిద్దాము."*

💐💐💐💐💐💐💐💐💐

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top