మీ ఎస్. ఆర్. లో అన్ని ఎంట్రీస్ పడ్డాయా?
👉ప్రతి సంవత్సరం ఎస్ .ఆర్ .ను చెక్ చేస్తున్నారా?
👉అయితే ఈ క్రింది entries చెక్లిస్ట్ రాసుకోండి మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్ .ను అడిగి చెక్ చేసుకోని ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ హెచ్.ఎం .లేదా ఎం .ఈ .ఓ. గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి.
1. Periodical Increments entry:-
ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ ఎస్. ఆర్. లో వేశారా? లేదా ?సరి చూసుకోండి.
2.G.I.S.ఎంట్రీ:-
జి .ఐ .ఎస్ .చందా డిడక్టు అవుతూ ఉంటుంది కదా .మీ ఎస్ .ఆర్ .లో జి .ఐ .ఎస్ .అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంత కాలం ,ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా ?లేదా ?చెక్ చేసుకోవాలి .అయితే జి .ఐ .ఎస్ .అమౌంట్ enhance అవుతూ ఉంటుంది .గమనించుకోవాలి.
*3.. APGLI ఎంట్రీ:-*
మీ జీితంలో ప్రతి నెల ఏ.పీ .జి .ఎల్ .ఐ .అమౌంట్ డిడక్ట్ అవుతుంది కదా .మీ ఎపిజిఎల్ఐ subscription enhance అయినప్పుడల్లా ఎంట్రీ పడిందా ?లేదా? చెక్ చేసుకున్నారా.
*4.E. L. Entry:-*
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్ .ఆర్. చివర రాసే ఈ .ఎల్. ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
*5.Half Pay Leave Entry:-*
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half pay leave లను S. R.చివరి పేజీలో half pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
*6.Training Entry:-*
ఇంతవరకు సమ్మర్ లో అయిన ట్రైనింగ్ , ఇతర డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి .ఇది చాలా ముఖ్యమైన విషయం.
*7. E. H. S. Entry:-*
Employee Health Scheme ఎంట్రీ మీ ఎస్. ఆర్ .లో రాయబడిందా ?లేదా ?చూసుకోవాలి.
*8. A.A.S. Entry:-*
మన సర్వీసు 6,12,18,24సంవత్సరాలు పూర్తి అయినప్పుడు A.A.S. ఇంక్రిమెంట్ మన ఎస్. ఆర్. లో ఎంట్రీ అయిందా ?లేదా ?చూసుకోవాలి.
*10. Service Regulations entry:-*
రెగ్యులరైజేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి.
*11.Promotion entry:-*
మనకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్. ఆర్ .లో వేయించుకోవాలి.
*12.Transfers entry:-*
మనకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి.
*13.Departmental test entry:-*
మనం GOT,EOT, Language tests,.HM account tests ఇలా ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.
*14.Higher Qualifications entry:-*
మన డిగ్రీ ,పీజీ ,బీఈడీ ,ఎంఈడీ ,ఎంపీఈడీ ఇలా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.