Search This Blog

Sunday, March 13, 2022

*అమ్మ అంటే ఓ అనుభూతి...* *ఓ అనుబంధం....* *ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత....*


*అమ్మ అంటే ఓ అనుభూతి...*
*ఓ అనుబంధం....*
*ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత....*



*అమ్మ... ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో... ఎంత చెప్పినా తక్కువే....*
*మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది...*
*పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది...*
*అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే...*
*ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది...*
*అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది...*
*అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం....*
*మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్నా అని అనం.. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది...* 
*బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది...*
*అందుకే అమ్మ పిచ్చి తల్లి...*
*మనం తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది. ఏం నాన్నా ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏెమైపోతుంది..రా.. ఓ ముద్ద తిందువుగాని అంటుంది తప్ప, అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ*
*ఓ అమాయకురాలు...*
*మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలవిల్లాడిపోతూ, నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్టమీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వళ్లు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు.....*
*మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూర్ తిరుగుళ్లకు డబ్బు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు, సరదాలు తీరుస్తుంది...*
*అందుకే అమ్మ రాయబారి.....*
*అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది...*
*అమ్మ ప్రేమ.. ఎప్పుడూ మన గురించే ఆలోచన, మనమీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు....*
*అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు...*
*అమ్మ లేనివాడు....*
*అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు....*
*అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే....* *ఆప్యాయంగా అమ్మ కళ్లలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి.... మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం....* 

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top