Search This Blog

Sunday, March 6, 2022

సుఖమయ జీవితం

*🪴సుఖమయ జీవితం🪴*
  
 *అందమైన జీవితం ‘కలలు’ కంటే రాదు ’కష్టపడితే’ వస్తుంది.*

*మనం ఒకరికి ‘మంచి’ వాళ్ళం ఇంకొకరికి ‘చెడ్డ’ వాళ్ళం మరోకరికి ఏమీ కాము! ఇంకొకరికి అన్నీ మనమే! అదే జీవితం!* 

*నీవు ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం! ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం! ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద! ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ!*

 *అన్ని ఉన్నాయన్న అహంకారం వద్దు ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం గుడికో లేక స్మశానానికో అని.*

*ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటే పూరి గుడిసెలో ఉన్నా ప్యాలెస్ లో ఉన్నవారి కన్నా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలం.*

*సంతృప్తి తో ఉన్నవారికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అసంతృప్తి తో ఉన్నవారికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి.* 

*పచ్చ నోటు ముందు గుడ్డిదై పోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతూ ఉంది గుణం. ఆస్తుల ముందు ఆవిరై పోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు.*

*మనం చేసే పనిలో మంచి కనపడాలి కాని మనిషి కనపడాల్సిన అవసరం లేదు!*

**జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే మూడు పనులు చెయ్యాలి… ఎప్పటి పనులు అప్పుడే చేయాలి! ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి! ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి!*
.          
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                      
   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

 *మనసు మాటల ముత్యాలు*

🌹 *దీపం విలువ చీకట్లో తెలుస్తుంది.*
*డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది.*
*కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది.*

🌹 *పరుల మేలుకోసం చేసే*
*పని ఎంత చిన్నదైనా*
*అది మనలోని అంతఃశక్తిని*
*మేలుకొలుపుతుంది.*
*మనసుని ఉల్లాస పరుస్తుంది.*

🌹 *మనం విమర్శించినప్పుడు*
*మనకు తెలిసిందే నిజమనుకుంటాం...*
*మనం ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు*
*తెలుసుకోవాల్సింది చాలా ఉందనుకుంటాం...*

🌹 *మాటను ఎప్పుడైతే పవిత్రంగాను,*
*శుభ్రంగాను, శుద్ధంగాను వాడుకుంటామో*
*అప్పుడు ఆ మాటకు విలువ పెరిగి*
*మంత్రంలాగా పనిచేస్తుంది....!*

🌹   ఎవరికీ తలవంచనది 
       *ఆత్మగౌరవం*,
ఎవరిముందు చేయిచాచనిది 
        *ఆత్మాభిమానం*, 
      ఎవరినీ కాదనలేనిది 
           *ఆత్మీయత*, 
ఈ *మూడు ఆత్మల కలయికల*
    జీవితమే *ఆదర్శనీయం.*

🌹 *ఎదుటివారి ఆలోచనలను గౌరవించకపోయినా*
  *పర్వాలేదు*
*అపహాస్యం మాత్రం చెయ్యకండి,*
  *ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది*
   *మనకు దాన్ని చూసే గుణం ఉండాలి.*
  *దానిని అభినందించే మంచి మనసు కూడా*
         *ఉండాలి.!.*


జీవితంలో ఎవర్నీ *తగ్గించి* మాట్లాడకూడదు, ఎవర్నీ *బాధించకూడదు*, ఇవాళ నువ్వు *శక్తిమంతంగా* ఉండొచ్చు, *కానీ* కాలం *నీ కన్నా* శక్తిమంతమైనపని గుర్తుంచుకో,. కాబట్టి మనం *మంచితనంతో* ఉండాలి మంచి *మనసుతో* ఆలోచించాలి.

    మనలో మనకు *పలకరింపులు* లేకపోతే *అనుబంధాలు* ఉండవు మనం ఒకరిని ఒకరు *గౌరవించుకోకపోతే* ప్రేమలుండవు *నమ్మకం* అనేది లేకపోతే *ఒకరితో* ఒకరు ఉండలేరు.

    మనిషికి *ప్రశాంతతని* ఇచ్చేది *ప్రకృతే* కావచ్చు *కానీ !* మనసుకు *ప్రశాంతతను* ఇచ్చేది మాత్రం మన *మనసుకు* నచ్చినవారు మాత్రమే. 

    నా *అంత* వాడు లేడు అని *విర్రవీగుతున్న* మానవునికి నీ *అంతానికి* ఒక సూక్ష్మజీవి చాలు అని చెప్పుతున్నాను.

    నీవు *మాట్లాడుతున్నప్పుడు* నీకు  తెలిసిందే  చెప్పగలవు.  *కానీ* నీవ్వు  వినేప్పుడు  ఏదో  కొత్త  విషయం  తెలుసుకుంటూ  ఉంటావు *జీవితం* లో  ఏది  ఎప్పుడు  *రావాలో* అప్పుడే  తప్పకుండా  వస్తుంది.  ఏది *ఎంత*  కాలం  నీతో  ఉండాలో *అంత కాలం*  మాత్రమే  వుంటుంది.  *ఏది*  ఎప్పుడు  వదిలిపోవాలో  అప్పుడే  పోతుంది. ఇందులో  దేన్నీ  నీవు  ఆపలేవు. నీ  *చేతిలో* ఉన్నది  ఒక్కటే *ఉన్నంత"  వరకు  నీతో  ఉన్నవాటి  *విలువ* తెలుసుకొని  *జీవించడమే*.

🍀🌺🍀🌺🍀🌺🍀

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top