Search This Blog

Friday, January 14, 2022

Inspirational Story : ఎంతో కష్టపడి చ‌దివా..ఈ ల‌క్ష్యం కోసం నిద్రలేని రాత్రులు గ‌డిపా..

కష్టపడితేనే ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేందుకు బాగా చదవాలి.
Ronald Ross, IAS
రొనాల్డ్ రోస్, కలెక్టర్

మొదట రైల్వేలో ఉద్యోగం వచ్చినా కలెక్టర్‌ కావాలనేదే నా లక్ష్యం. దానిని చేరుకునేందుకు ఎంతో కష్టపడి చదివా. నిద్రలేని రాత్రిళ్లు గడిపా. మీరు కూడా లక్ష్యాన్ని ఎంచుకొని.. ఆ దిశగా చదవండి’ అని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ పేర్కొన్నారు.

అనుకున్న లక్ష్యం చేరుకోకపోతే..
ఇప్పటికైనా ఏం పర్వాలేదని, ఇంటికో పది ఇటుకలు తెచ్చుకోండని, మిగతా సిమెంట్‌ తదితర వస్తువులను నేను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలల్లో ప్రహరీని పూర్తి చేద్దామని పేర్కొన్నారు. మన వసతులను మనమే సమకూర్చుకుందామని సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల ఆత్మస్థైర్యం కోసం కరాటే తరగతులను నిర్వహించాలని ముఖ్యంగా బాలికలకు తప్పనిసరిగా శిక్షణ ఇప్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనుకున్న లక్ష్యం చేరుకోకపోతే గ్రామీణ స్థాయిలోనే మన జీవితం ఉంటుందని, ఐఏఎస్‌ కావాలనేది తన లక్ష్యమని, రైల్వేలో ఉద్యోగం వచ్చినా.. ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు చదివి లక్ష్యాన్ని చేరుకున్నానన్నారు.

ఆ కవర్‌ తీసుకొని..

School Students


ఇదిలాఉండగా, కారులో నుంచి కలెక్టర్‌ దిగి పాఠశాల ఆవరణలోకి వచ్చే క్రమంలో ఓ ప్లాస్టిక్‌ కవర్‌ కనిపించింది. దీంతో కలెక్టర్‌ ఆ కవర్‌ తీసుకొని ఉపాధ్యాయుడు లక్ష్మినారాయణ చేతికి ఇవ్వడంతో.. ఆయన అట్టి కవర్‌ను జేబులో పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్‌ వెరీగుడ్‌ అని అభినందించారు. డ్రెసింగ్‌ విషయంలో కూడా ఉపాధ్యాయులందరూ చక్కగా ఉండాలని సూచించారు.

ఇవి చూస్తే...

Schools
ప్రభుత్వ పాఠశాలలంటే అందరిలోనూ చిన్నచూపు ఉంటుంది. చదువు బాగా చెప్పరని, తరగతి గదులు సరిగా ఉండవని, సర్కారీ స్కూళ్లన్నీ సమస్యల వలయం లోనే కొట్టుమిట్టాడతాయని భావిస్తారు. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఆ అభిప్రాయాలు మార్చుకోక తప్పదు. చుట్టూ పచ్చని చెట్లు.. పరిశుభ్రమైన పరిసరాలు.. ఆకర్షణీయమైన తరగతి గదులు.. చూస్తే ఇది సర్కారీ స్కూలేనా అని ఆశ్చర్యపోయే రీతిలో పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త శోభతో కనిపిస్తాయి. ఏళ్లుగా అనేక సమస్యలతో కొనసాగిన ఈ పాఠశాలల్లో ఇప్పుడు ఒక్కొక్క టిగా సదుపాయాలు సమకూరుతున్నాయి. కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ తీసుకున్న చొరవే ఇందుకు కారణం.

ఇంటికో వంద.. బడికి చందా..
సర్కారీ స్కూళ్లంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదని.. వాటి బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నుంచి స్వచ్ఛందంగా రూ.వంద వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల న్నది దీని ఉద్దేశం. దీనికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్‌ కంపెనీలు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులంతా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.11 కోట్లు జమ కాగా, ఆ నిధులతో వసతులు కల్పిస్తున్నారు.
 
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే.. అంతే

IAS


ఆయనకు విధి నిర్వహణ అంటే ప్రాణం. ఏ మాత్రం అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా సహించడు. నీతి నిజాయితికి ఆయన మారు పేరు. యంగ్ అంగ్ డైనమిక్ కలెక్టర్ గా పేరు సంపాదించారు. విద్య, వైద్యం, ఉపాధికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. ఆకస్మిక తనిఖీలు చేసి ఉద్యోగులకు హడల్ పుట్టిస్తారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తారు. ఎవరు చెప్పినా వినడు. ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనే ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్.
 
కుటుంబ నేప‌థ్యం:

రొనాల్డ్ రోస్ తమిళనాడులోని ఓ మామూలు మధ్య తరగతి కుటుంబంలో 1980 జూన్ 24న జన్మించారు. తన విద్యాభ్యాసమంతా తమిళనాడులోనే జరిగింది. మద్రాసు యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు.

మొదటి పోస్టింగ్.. :
2006లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2006 నుంచి 2007 వరకు ట్రైనింగ్ పూర్తి చేసిన రాస్‌కు 2007 జూలై 22న అసిస్టెంట్ కలెక్టర్‌గా ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్ కార్యాలయంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు.అసిస్టెంట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్ హోదాలలో అదే కార్యాలయంలో పనిచేసిన ఆయన 2008 సెప్టెంబర్‌లో నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా నియమితులు కాగా అక్కడ 2010 వరకు పని చేశారు. 2010 ఫిబ్రవరి 19న రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియమితులైన రొనాల్డ్‌రాస్ 2011 ఆగస్టు 19 వరకు అక్కడే విధులు నిర్వహించారు. 2011 ఆగస్టు 20న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో అడిషనల్ సీఈవోగా పనిచేశారు. 2012 సెప్టెంబర్11న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. సుమారు రెండు సంవత్సరాల పాటు జీహెచ్‌ఎంసీలో వివిధ  జోన్లలో పనిచేసిన ఆయన సిటీ ప్లానింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు. విధుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న రొనాల్డ్‌రాస్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారన్న పేరుంది. అలాగే మెద‌క్ జిల్లా క‌లెక్టర్‌గా ప‌నిచేశారు. తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా.. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ప‌నిచేసారు.

ఈ ల‌క్షంతోనే...
కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి 2006లో ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. శిక్షణ తర్వాత ఉమ్మడి ఏపీని తన కేడర్ గా ఎంచుకున్నాడు. వివిధ ప్రాంతాలలో పని చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నాడు. నిజామాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా పని చేశాడు.
 
ఆయన కలెక్టర్ అయినా...
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా రొనాల్డ్ రోస్ పని చేశారు. రోస్ కు ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఆయన అన్యాయాన్ని, అక్రమాలను సహించడు. ఎక్కడ పని చేసినా ప్రజల అభిమానాన్ని చురగొన్నాడు. విద్య, వైద్యం, ఉపాధికి రోస్ ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. ఆయన కలెక్టర్ అయినా సాదాసీదాగా ఉంటాడు.
 
కేవలం పట్టణాలకే పరిమితమైన శిక్షణను...
బ్రైటర్ మైండ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది కేవలం పట్టణాలకే పరిమితమైన శిక్షణ. అటువంటి దానిని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పేద పిల్లలకు అందేలా చేయగలిగారు. బ్రైటర్ మైండ్ 30 గంటల శిక్షణకు రూ.13 వేలు. చిన్నప్పటి నుంచే ప్రతి అంశంలో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి.. మానసికంగా దృఢంగా చేసే బ్రైటర్ మైండ్‌ను పాలమూరుకు తీసుకువచ్చారు. దీని కోసం కలెక్టర్ క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు కేటాయించారు. రామచంద్రా మిషన్ ను ఒప్పించి కేవలం 10 శాతం ఖర్చుతో బ్రైటర్ మైండ్‌కు శ్రీకారం చుట్టారు. ఒక్కో విద్యార్థికి రూ.1300లతో మాత్రమే ఈ శిక్షణను ఇప్పించారు. ముందుగా దీనిని 12 పాఠశాలల్లో ప్రారంభించారు. క్రమక్రమంగా జిల్లా అంతటా విస్తరించింది.
 
చదువుకోవాల్సిన వయస్సులో..

Admissionsronald ross ias in school


ఓ రోజు గ్రామాల పర్యటనలో భాగంగా వెళుతున్న రోస్ కు కోయిల్‌కొండ పోతన్‌పల్లి వద్ద వద్ద కొందరు పిల్లలు మేకలను కాస్తూ కనిపించారు. ఇది చూసిన ఆయన వాహనం ఆపి వారితో మాట్లాడారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు వెంటనే వారిని. తన వాహనంలో ఎక్కించుకుని దేవరకద్ర ఉర్దూ మీడియం పాఠశాలకు తీసుకొచ్చారు. పిల్లల తండ్రి చనిపోయాడని తెలుసుకున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు 9వ తరగతి, ఇంకొకరు 3 వ తరగతిలో చదువు మానేశారని తెలుసుకొని వారిని స్కూల్ లో జాయిన్ చేయించారు. వారి బాధ్యతను అక్కడి ఉపాధ్యాయుడికి అప్పగించారు.
 
వెంటనే వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు....

IAS Officer Duty


మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న గవర్నమెంట్ స్కూల్ లో రోస్ ఓ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో 8 మంది టీచర్లు, ఒక విద్యా వాలంటీర్ విధులకు హాజరు కాలేదు. పాఠశాల సమయం అయినా వారు రాలేదు. ఎటువంటి సమాచారం లేకుండా గైర్హాజరయ్యారని తెలుసుకున్న రోస్ వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించారని ఊట్కూర్ మండల పరిధిలో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.
 
హాస్టళ్లలో రాత్రి నిద్ర, బోజ‌నం..
విధుల్లో అలసత్వం వహిస్తే రోస్ ఏ మాత్రం సహించడు. డ్యూటీ మైండెడ్ కలెక్టర్ గా రోస్ కు పేరుంది. ఎప్పటికప్పుడు రోస్ ఆకస్మిక తనిఖీలు చేస్తారు. పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం చేస్తారు. హాస్టళ్లలో రాత్రి నిద్ర చేస్తారు. ఆస్పత్రులలో వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకుంటారు. ఆయన ఎప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారో తెలియక అధికారులు గజగజ వణుకుతుంటారు.
 
ఇది మింగుడు పడని కొంత మంది..
నిజామాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా పని చేసినప్పుడు కూడా ఇదే దూకుడుతో వ్యవహరించారు. ఇది మింగుడు పడని కొంత మంది అధికారులు, నేతలు ఆయనను బదిలీ చేయించారని అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.
 
వివాహాం..:

Family
రోస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ రొనాల్డ్ రోస్ అందరికి "స్పూర్తి"గా నిలుస్తున్నారు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top