Search This Blog

Saturday, January 22, 2022

Health Tips: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా.. ఖచ్చితంగా ఈ 3 పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..!

Stress, Depression Relief Foods: కరోనా మహమ్మారి కారణంగా, ప్రజలు అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మహమ్మారి సమయంలో ఎంత మంది తమ ఆత్మీయులను కోల్పోగా, మరికొంత మంది ఈ మహమ్మారి బారిన పడి తీవ్రం బాధను అనుభవించారు. పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు భయం, ఒత్తిడి, అనేక రకాల మానసిక సమస్యలకు గురవుతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే.. గత కొన్నేళ్లుగా ప్రజల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ సమస్య చాలా ఎక్కువైంది. ప్రజలు యోగా, ధ్యానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని మీరు కూడా ఎదుర్కోంటున్నట్లయితే, మీరు ఆహారం, పానీయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మనసును దృఢంగా, సంతోషాన్ని కలిగించే ఇలాంటి వాటిని ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. అశ్వగంధ- అశ్వగంధను మన దేశంలో ఆయుర్వేద మందులలో ఏళ్ల తరబడి వాడుతున్నారు. ఏదైనా మెడికల్ స్టోర్‌లో మీకు అశ్వగంధ దొరుకుతుంది. దీని టాబ్లెట్లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. మీరు ప్రతిరోజూ 1 గ్రాము అశ్వగంధ తింటే, అది ఒత్తిడి నుంచి గొప్ప ఉపశమనం ఇస్తుంది. అశ్వగంధను పాలతో కూడా తీసుకోవచ్చు.

2. కుంకుమపువ్వు- కుంకుమపువ్వును ఆందోళన, ఒత్తిడిని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది మెదడులోని సంతోషకరమైన హార్మోన్లను సక్రియం చేస్తుంది. ఆందోళన, ఒత్తిడిని తొలగించడానికి కుంకుమపువ్వు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఒక క్లాత్‌లో చుట్టుకుని వాసన కూడా చూడొచ్చు. ఆహారంలోనూ చేర్చుకోవచ్చు.

3. మునగ ఆకులు- ఈ రోజుల్లో మునగ ఆకులను ఎక్కువగా వాడుతున్నారు. ఒత్తిడిని తగ్గించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఈ ఆకులు వాటి అద్భుత లక్షణాల కారణంగా సూపర్ ఫుడ్‌గా పేరుగాంచాయి. మునగ ఆకులను పొడి రూపంలో మీ ఆహారంలో చేర్చవచ్చు. ఆందోళన, ఒత్తిడిని తొలగించడానికి కరివేపాకు, బచ్చలికూర, గోధుమ గడ్డి, బ్రకోలీ, ఇతర ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు.





4. అరటిపండు- అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేసే పండు. అరటిపండు తినడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆందోళనగా అనిపిస్తే, వెంటనే అరటిపండు తినండి. ఇది ఆ సమయంలో మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అరటిపండు తినడం వల్ల శరీరంలో చక్కెర సరఫరా అవుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. బనానా షేక్ లేదా స్మూతీని కూడా తాగవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే పరిగణించడంది. వీటిని పాలించాలనుకుంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించండి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top