Search This Blog

Saturday, January 22, 2022

BSNL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి


BSNL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

BSNL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
  • 18hr
  • 0 views
  • 36 shares

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.


ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తున్న సంస్థ తాజాగా మరో నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. లీగల్ ప్రొఫెషనల్స్ (Fulltime Young Legal Professionals) విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మొదట కాంట్రాక్ట్ గడువు ఏడాది ఉంటుంది. అభ్యర్థుల పర్ఫార్మెన్స్, అవసరాల రిత్యా కాంట్రాక్ట్ ను 2, 3 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

LLB చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు విద్యార్హత పొందిన సంస్థ తప్పని సరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) తో గుర్తింపు పొంది ఉండాలి. అభ్యర్థులు LLBలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్హత అనంతరం మూడేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75 వేల వేతనం చెల్లించనున్నారు. వేతనం మినహా ఏ ఇతర అలవెన్స్ లు ఇవ్వబడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా ఎంపికైన అభ్యర్థులు బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్, న్యూ డిల్లీలో లో పని చేయాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే:

Step 1: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 2: అనంతరం మీకు నోటిఫికేషన్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.

Step 3: అనంతరం Click here for Registration అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటగా New Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5: పేరు, ఇతర సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Step 6: అనంతరం మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top