Search This Blog

Saturday, January 22, 2022

చాణక్య నీతి: ఈ మూడు విషయాల్లో అసంతృప్తి కలిగినా.. అది మీకెంతో మేలు చేస్తుంది!

జీవితంలో ప్రతి పరిస్థితిని స్వీకరించి సంతృప్తి చెందాలని, తాను సాధించాలనుకున్న దాని కోసం నిరంతరం శ్రమించాలని పెద్దలు చెబుతుంటారు. సంతృప్తి, అసంతృప్తి.. ఈ రెండింటికీవున్న ప్రాముఖ్యత గురించి ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్య నీతి అనే తన పుస్తకంలో ఆచార్య చాణక్య దీనికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిస్థితులను ప్రస్తావించారు. సంతృప్తి, అసంతృప్తి.. ఈ రెండూ జీవితంలో ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయని, అయితే వాటిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నారు. కొన్ని సందర్భాల్లో మనిషికి అసంతృప్తి చాలా అవసరం. ఎందుకంటే ఆ అసంతృప్తి అతనికి జీవితంలో ఎంతో మేలు చేస్తుంది. ఆచార్య చాణక్యుడు ఏ పరిస్థితుల్లో మనిషి సంతృప్తి చెందాలో, ఏ పరిస్థితులలో అసంతృప్తితో తృప్తి చెందాలో తెలియజేశాడు ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం భార్య అందంగా లేకపోయినా ఆ వ్యక్తి సంతృప్తిగా ఉండాలి. మరే ఇతర స్త్రీలకు ఆకర్షితులు కాకూడదు. దీనిని అతిక్రమిస్తే ఆ వ్యక్తి తనకు తానుగా కష్టాలను ఆహ్వానించిన వాడవుతాడు.

ఏ ఆహారం దొరికినా.. తృప్తి చెంది ఆనందంగా స్వీకరించాలి. ఎప్పుడూ ఆహారాన్ని వృథా చేయకూడదు. భగవంతుడు మీకు ఆహారం ఇచ్చినందుకు మీరు ఎంతో అదృష్టవంతులని భావించాలి.

వ్యక్తి తనకున్న ఆదాయంతో సంతృప్తి చెందుతూ సంతోషంగా ఉండాలి. ఆదాయాన్ని అనుసరించి మీ ఇంటి ఖర్చులు ఉండేలా చూసుకుని ముందుకు సాగేందుకు కృషి చేయాలి. కానీ ఎప్పుడూ బాధపడుతూ ఇతరుల సంపద వైపు చూడకూడదు.

విద్య, జ్ఞానం విషయంలో మనిషి సంతృప్తి చెందకూడదు. మీరు ఎంత అసంతృప్తితో ఉంటారో మీరు అంత సామర్థ్యం, యోగ్యతను అందుకోగలుతారు. విద్య, విజ్ఞానం మీకు గౌరవాన్ని, సంపదను తెచ్చిపెడతాయి.

దానం విషయంలో వ్యక్తి అసంతృప్తిగా ఉండాలి. దానధర్మాల వలన మనకు పుణ్యం లభిస్తుంది. మన జీవితం మెరుగుపడుతుంది.

మీరు భగవంతుని మంత్రాన్ని ఎంత ఎక్కువగా జపిస్తే అంత మేలు జరుగుతుంది. అందుకే మంత్రాన్ని జపించడంలో ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top