మాటే మంత్రం:-
💗 *"కాలు జారితే వెనక్కి తీసు కోగలం...*
*కానీ, నోరు (మాట) జారితే తీసుకోలేం...*
*అనేది పెద్దల మాట.*
*"మాట"కు ఉన్న "శక్తి" చాలా గొప్పది . . .*
💗 *"శరీరం"లో విరిగిన "బాణాలను" ఎన్నింటినైనా ప్రయత్నించి బయటకు తీయ వచ్చును.*
*కానీ "మనసు"లో గుచ్చుకున్న బాధాకర మైన "మాటలను" ఎలా వెనక్కి తీసు కోగలం...?*
*కాబట్టి ప్రతి "మాట"ను ఆచితూచి పలకాలి. లేకపోతే ఊహించని అనర్థాలు జరుగుతాయి . . .*
💗 *కనుక,*
*మన నోటి నుండి* *"మాట" బయటకు వచ్చేముందు,*
*మనం మరొకసారి "మననం" చేసుకుంటే మంచిది.*
*అలా చేయడం వలన "మాటల" వలన కలిగే అనేక "దోషాలు" తొలగిపోతాయి . . .*
💗 *అందుకే... ఋషులు తాము* *మాట్లాడే*
*"మాటల"ను* *"హృదయపు ద్వారం" దగ్గర 3'సార్లు పరీక్షీంచి...*
*ఆ పరీక్షలో నెగ్గిన "మాటలనే" బయటకు పంపేవారట.*
*హృదయంలో రూపుదిద్దుకున్న "మాటను" మొదటి ద్వారం దగ్గరకు రాగానే ...*
*"నేను అనబోయె
ఈ "మాట" సత్యమైనదేనా?*
*అని...* *ప్రశ్నించుకునేవారట.*
*అది సత్యమని నిర్దారణ అయ్యాక,*
*2'వ ద్వారం దగ్గర ఆపి ఈ సంధర్భంలో ఈ "మాట" అనడం అవసరమా?*
*అని ప్రశ్నించు కునేవారట.*
*దానికి అనుకూలమైన సమాధానం వచ్చాక, 3'వ ద్వారం వద్దకు రాగానే మరొకసారి "ఈ "మాటలు" ఎదుటి వారికి తప్పక మంచి చేస్తాయా?*
*అని ప్రశ్నించు కొని దానికి అవును.*
*అని సమాధానం వచ్చాకే,*
*వారి నోటి నుండి "మాట" బయటకు వచ్చేది.*
*అందుకే వారి "మాటల"కు అంత "శక్తి" ఉండేది.*
*"శక్తి" ఎంతటి దంటే...*
*అంత "తపస్సంపన్నులు"* *సైతం వారు*
*"ఆడిన మాటలను" వారే వెనక్కు తీసు కోలేక పోయే వారట . . .*
💗 *ముఖభాగంలో, కళ్లు,*
*ముక్కు రంధ్రాలు, చెవులు'*
*లాంటివన్నీ రెండేసి *ఉన్నప్పటికీ,*
*"నోరు" మాత్రం ఒక్కటే ఉంటుంది.*
*ఎందు కంటే, "అనవసరమైన మాటలు" బయటకు రాకుండా నియంత్రించ డానికే ఇలా చేయడం లోని "అంతర్యం" . . .*
💗 *అందుకే,..*
*ఏ సమయానికి*
*ఏ "మాటలు" అవసర మౌతాయో,*
*అలాంటి
"మాటలే"
పలికి,
ఇతరుల "మనసు" లను,
నొప్పించ కుండా, చాకచక్యంగా నడుచు కున్న వాడే "ధన్యుడు" అంటారు . . .*
💗 *"నాలుక" చివరి నుండి వచ్చే "మాట'తీరు" వల్లనే,* *సంపదలు, *బంధువులు,*
*మిత్రులు చేకూరుతారు.*
*"మాట తీరే" బాగాలేక పోతే, చెరసాల ప్రాప్తి కలుగ వచ్చు.*
*ఆ "మాట తీరు" సరైంది కాక పోతే, మరణం కూడా సంభ వించ వచ్చు . . .*
💗 *కనుక, మనం "మాట్లాడితే" వేటాడినట్లు ఉండ కూడదు,*
*ఒక "మంత్రం"లా ఉండాలి.*
*అందుకే "మాటే, మంత్రం" అవ్వాలి...*
*మై డియర్ ఫ్రెండ్స్... మనమందరం కూడా ఈ క్షణం నుండే...*
*మన "మాట" మీద ధ్యాస కలిగి ఉంటూ.. ప్రేమగా...*
*ఒక మంత్రం లా... మన "మాటల"ను ఉపయోగించు కుందాం...*