Search This Blog

Monday, June 14, 2021

Step Up of Pay

-: Step up of  Pay :-


చరిత్ర : 9వ వేతన సవరణ సంఘం పునరుద్ధరించిన స్టెప్ అప్, ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ సౌకర్యాలను 10వ వేతన సవరణ సంఘం G.O.MS.No. 38, తేది : 15-4-2015 ద్వారా కొనసాగించడం జరుగుచున్నది. RPS 93కి ముందు ఇవి అమలులో ఉన్నాయి. 31.7.1993నుండి 1998, 2005 పి.ఆర్.సి.లలో వీటి అమలును నిలిపివేశారు. ఆ కారణంగా ఏర్పడిన వేతన వ్యత్యాసాల వల్ల పలువురు సీనియర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం జరిగింది. ఈ నష్టాలను పి.ఆర్.సి. కమిటి దృష్టికి తీసుకువచ్చి స్టెవ్ అప్, ప్రీఫోన్ మెంట్ సౌకర్యాలను 9వ వేతన సవరణ సంఘం వీటిని తిరిగి పునరుద్ధరించారు.

స్టెప్ అప్ (Step up) వివరణ :
1. సీనియర్ ఉపాధ్యాయులు తనకంటే జూనియర్ ఉపాధ్యాయుల కంటే తక్కువ వేతనము పొందుతుంటే ఆట్టి వ్యత్యాసమును FR-27 ప్రకారం సవరింపబడుటను "స్టెవ్ అప్ (Step up)“ అందురు.

2. ఆప్రయత్న పదోన్నతి పథకం (AAS) అమలువల్ల వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం G.O.MS.No. 297  F & P, తేది : 25-10-1983 ద్వారా స్టెప్ అప్ ఉత్తర్వులు జారీచేసింది.

3. AAS అమలు వల్ల వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం G.O.MS.No. 75, F & P, తేది : 22-2-1994 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

4. ఇట్టి సౌకర్యాన్ని ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేస్తూ  G.O.Ms.No. 475, Edn, తేది: 2-11-1998 విడుదలచేసింది.

5. పై ఉత్తర్యులు 1993 పి.ఆర్.సి అనగా 31-7-1993 వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. తదుపరి RPS 2005లో పునరుద్ధ రింపబడింది.

స్టెప్ అప్ నియమ నిబంధనలు:

1. సీనియర్, జూనియర్ ఉపాధ్యాయునీ నియామకం ఒకే యూనిట్లో జరిగి ఉండాలి అనగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ లో పనిచేసే వారికి అదే యూనిట్లో పనిచేసే వారితో పోల్చుకోవాలి .

2.సీనియర్ జూనియర్ ఒకే "పేస్కేల్' కలిగియుండాలి.

3. పదోన్నతి పొందుటకు ముందు క్రింది కేడర్ పోస్టులో జూనియర్ యొక్క వేతనము సీనియర్ వేతనము కంటే తక్కువగా గాని సమానముగా గాని యుండాలి.

4. సీనియర్, జూనియర్ ఇద్దరూ ఒకే సబ్జెక్ట్ మరియు ఒకే  ప్రమోషన్ ఛానల్ కలిగిన కేటగిరిలోనికి పదోన్నతి పొంది యుండాలి. ప్రమోషన్ ఛానెల్ కలిగిన కేటగిరిలోనికి పదోన్నతి పొంది ఉండాలి .

5. FR - 27 ప్రకారం సీనియర్ వేతనము, జూనియార్ వేతనముతో సమానంగా (స్టెవ్ అప్) చేసి న తదువరి సీనియల్
ఉపాధ్యాయునికి స్టెవ్ అప్ జరిగిన తేది నుండి ఒక సంవత్సరము తరువాత ఇంక్రీవెంటు మంజూరు చేయబడుతుంది.
ఒకవేళ జూనియర్ వేతనము FR-31 (2) ప్రకారం ఇంక్రిమెంటు తేదికి రీఫిక్స్ చేయబడి వుంటే సీనియర్ వేతనము కూడా అదేవిధంగా సదరు తేదికి జూనియర్ తో సమానంగా స్టెప్ అప్ చేయబడును.

6.సీనియర్ పదోన్నతి పొందిన తదుపరి జూనియర్ దిగువ క్యాడర్ లోనే 6 / 12 / 18 / 24 సం. స్కేలులో వేతన నిర్ణయం పొంది తదుపరి పదోన్నతి పొందిన సందర్భములో జూనియర్ వేతనముతో సీనియర్ స్టెప్ అప్ చేయబడును.

7. సీనియర్ పదోన్నతి పొందినపుడు FR-22(a) (i ) ప్రకారం వేతన నిర్ణయం జరిగి, జూనియర్ పదోన్నతి పొందినపుడు FR-22 (b ) ప్రకారం వేతన  నిర్ణయం జరిగిన సందర్భములో వీరి వేతనములో కలిగే అసమానతలను స్టెప్ అప్ ద్వారా సరిచేస్తారు

8. సీనియర్ వేతనం కంటే జానియర్ వేతనం :
     (a ) ఆదనపు అర్హతలకు మంజూరు చేయబడిన అదనపు ఇంక్రిమెంట్ల వల్లగాని
     (b ) కుటుంబ నియంత్రణ అమలుకు జారీ చేయబడిన వ్యక్తిగత వేతనము వల్లగాని
     (సి )  జూనియర్ కు మంజూరు చేయబడిన ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు వల్ల గాని పెరిగినట్లయితే వీరి వేతనములో  వచ్చిన వ్యత్యాసమును ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం ప్టెప్ అప్ చేయు అవకాశము లేదు.


ఉదాహరణ : 2000 డి.యన్సీ.లో 13-11-2000న నియామకమైన అను ఇరువురు ఉపాధ్యాయుల స్టెప్ అప్ ని పరిశీలిద్దాం
a) SGT సెలక్షన్ లిస్ట్ ప్రకారం సీనియర్ 'A' ఉపాధ్యాయుడు ప్రథమ నియామకం తేదీకి B.SC., B.Ed. (జీవశాస్త్రం) అర్హతలు కలిగి AASలో 8 సం. స్కేలు తీసుకున్న అనంతరం  28. 4 . 20212 నాడు SA (జీవశాస్త్రం) ప్రమోషన్  పొందినందున .FR - 22(B) ప్రకారం వేతన స్థిరీకరణ జరిగింది.

b) B' అనే ఉపాధ్యాయుడు ఇంటర్, టి.టి.సి. అర్హతలతో ఉద్యోగంలో చేరిన తరువాత కాలంలో B.SC, B.Ed. అర్హతలు సంపాదించి 12 సం. స్కేలు తీసుకున్న అనంతరం 12న స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రంగా ప్రమోషన్ పొందినాడు. 'B' ఉపాధ్యాయుని వేతనం కూడా FR-22(B) ప్రకారం స్థిరీకరించబడుతుంది. ఆకారణంగా B ఉపాధ్యాయుడు 'A' కంటే 1 ఇంక్రిమెంటు అదనంగా పొందుతున్నాడు. అటువంటి సందర్భంలో 'A' వేతనాన్ని B కి ప్రమోషన్ పోస్టులో వేతన స్థిరీకరణ జరిగిన తేది నుండి స్టెప్ అప్ ద్వారా సమానం చేస్తారు. ఆటు తర్వాత సంవత్సరం తరువాత వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేస్తారు.

     ఈ స్టెప్ వేతన నిర్ణయము డిడివోలు చేయవచ్చును.  కాని డిఇఓ గారిచ్చిన సీనియారిటీ పట్టికల ద్వారా  సీనియర్, జూనియర్ను గుర్తించి ఇద్దరి Service Book లు పరిశీలించి వేతన నిర్ణయము చేయాలి.

స్టెప్ అప్, ప్రీఫోన్ మెంట్ కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు
1. G.O.Ms.No. 297, Fin, dt : 25-10-1993
2. G.O.Ms.No. 52, Fin, dt : 25-2-2010
3. G.O.Ms. No. 93, Fin, dt : 3-4-2010
4. G.O.Ms.No. 96, Fin, dt : 20-5-2011
5. Memo No. 33327.A /549 / A1 / PC-I/2009, dt : 13-3-2010.
6. Memo No. 5465/ 48 / A2 / PC.I/ 2011
7. Memo No. 12254 / 133/ PC-I/ 2010, dt : 30-8-2010

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top