Search This Blog

Monday, June 14, 2021

Special Disability Leave

ప్రత్యేక ఆశక్తత సెలవు (Spl Disability Leave)

🍁 ఫండమెంటల్ రూల్ 83 ప్రకారం విధి నిర్వాహణ సందర్భంలో గాయపడి అశక్తులైన శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులకు ఈ సెలవు మంజూరుచేయబడుతుంది.

🍁 సంఘటన జరిగిన మూడు నెలలలోగా అశక్తత స్పష్టమైన సందర్భంలోనే ఈ సెలవు మంజూరు చేయబడుతుంది.
*[(Fundamental Rule-83(1)]*

🍁 24 నెలలకు మించకుండా వైద్యాధికారి సిఫారసు మేరకు ఈ ప్రత్యేక అశక్తత సెలవును మంజూరుచేయు అధికారం ప్రభుత్వానికే తప్ప ఏ ఇతర అధికారులకు లేదు.

🍁 గజిటెడ్ ఉద్యోగుల విషయంలో అయితే మెడికల్ బోర్డు,NGO ల విషయంలో సివిల్ సర్జన్ సర్టిఫికెట్ జారిచేయాల్సి వుంటుంది.
*[(Fundamental Rule-83(3)]*

🍁 కాని సెలవు రెండు నెలలకు మించని పరిస్థితులలో ప్రభుత్వ వైద్యాధికారి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.
*(G.O.Ms.No.40 Fin తేది:03-06-1991)*

🍁 ఈ సెలవు ఇతర సెలవులతో కలిపి కూడా మంజూరుచేయవచ్చు.ఈ సెలవు ఏ సెలవు ఖాతా నుండి తగ్గించకూడదు.

🍁 ఈ సెలవు కాలంలో ఉద్యోగులకు 120 రోజులకు పూర్తి జీతం.మిగితా కాలానికి సగం జీతం మంజూరుచేస్తారు.

🍁 కార్యాలయం నుండి ఇంటికి,ఇంటి నుండి కార్యాలయానికి వేళ్ళుచున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల అశక్తతకు గురియైతే ఈ సెలవు మంజూరు చేయడానికి వీలులేదు.

🍁 కాని ఒక కార్యాలయం నుండి మరోక కార్యాలయానికి,కోర్టుకో లేక ఫీల్డులో కార్యస్థానమునకు వెళ్ళు సందర్భంలో ప్రమాదానికి గురై అశక్తులైన ఉద్యోగులు ఈ సెలవుకు అర్హులు.
*(G.O.Ms.No.133 F&P తేది:19-06-1991)

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top