Search This Blog

Monday, June 14, 2021

Sanction of Leave

*‌విద్యా శాఖలో సెలవు మంజూరు అధికారం - సంబంధిత ఉత్తర్వులు*

*👉విద్యాశాఖలో వివిధ రకాల సెలవుల మంజూరు,రిపోర్టింగ్,రిపోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే అధికారుల కాలపరిమితిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వబడినవి.*
(G.O.Ms.No.58,Edn తేది:22-04-2008)
(G.O.Ms.No.70,Edn తేది:06-07-2009)

 *☘PS & UPS ప్రధానోపాధ్యాయులు:☘*

*👉పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL, Spl.CL మంజూరు.*

 *☘ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు :☘*

*👉పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL, Spl.Cl, CCL, Maternity Leave లతో పాటు 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరు చేయవచ్చు.*
 *☘ పాఠశాల సముదాయ  ప్రధానోపాధ్యాయులు :☘*
*    స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సాధారణ సెలవు ( Casual Leave ) మంజూరు .

*☘మండల విద్యాధికారి(MEO):☘*

*👉మండల పరిధిలోని PS, UPS ప్రధానోపాధ్యాయులకు  Spl.CL, CCL , Maternity Leave మరియు ఉపాధ్యాయులందరికీ 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరుచేస్తారు.*

*☘ ఉపవిద్యాధికారి(Dy.EO):☘*

*👉హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు CL, Spl.CL, CCL లతో పాటు తన పరిధిలోని PS, UPS & HS ఉపాధ్యాయులందరికీ 6 నెలల వరకు ఇతర సెలవును మంజూరుచేస్తారు.*

*☘జిల్లా విద్యాశాఖాధికారి (DEO):☘*

*👉Dy.Eo, MEO లకు CL, Spl.CL, CCL మంజూరు చేస్తారు. Dy.Eo, MEO,హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులందరికీ 6 నెలలకు పైబడి 1 సం॥ లోపు ఏ రకమైన సెలవునైనా మంజూరుచేస్తారు.*

*☘పాఠశాల విద్యాశాఖ సంచాలకులు(DSE):☘*

*👉మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు 1 సం॥ పైబడి 4సం॥ వరకు ఏ రకపు సెలవునైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మంజూరు చేస్తారు. అంతకుమించిన కాలానికి సెలవు మంజూరు అధికారం ప్రభుత్వానికే ఉంటుంది.*

*☘ప్రసూతి సెలవు (Maternity Leave) సందర్భంలో☘*
   
*👉మహిళా ఉపాధ్యాయులకు 6 నెలల వరకు సెలవు మంజూరుచేయు అధికారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారం మండల విద్యాధికారులకు (MEO) లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.*
(G.O.Ms.No.84 తేది:17-09-2012)

*☘విదేశాలకు వెళ్ళేందుకు సెలవు మంజూరు:☘*
 
*👉విదేశాలకు వెళ్ళే ఉపాధ్యాయులు ఏ రకమైన సెలవుపై ఎంతకాలం వెళ్ళదలచుకున్నా (5సం॥ లోపు) ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి.విదేశాలలో ఉద్యోగం కొరకు వెళ్ళే ఉద్యోగులకు కొన్ని షరతులతో 5సం॥ వరకు EOL మంజూరుకు అనుమతిస్తారు.*
(G.O.Ms.No.214 F&P తేది:03-09-1996)
*******
Related GOs & Proc :

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top