Search This Blog

Monday, June 14, 2021

RTI

*సమాచార హక్కు చట్టము*  *( RTI )*

    సమాచార హక్కు చట్టము-2005 (సెంట్రల్ యాక్టు 22/2005 ) దేశ వ్యాప్తంగా తేది. 13.05.2010 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం గ్రామ కార్యాలయం నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా దరఖాస్తు చేసి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు.

*ముఖ్యాంశాలు : గ్రామస్థాయి నుండి రాష్ట్ర, కేంద్ర స్థాయి వరకు అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుండి ప్రజలు, వ్యక్తులు తమకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చును. ఇందుకై అన్ని కార్యాలయాల్లో సంబంధిత విభాగ అధికారులను ప్రభుత్వం అన్ని స్థాయిల్లో విధిగా ప్రజలు కోరిన సమాచారం యివ్వాలి.

*సమాచారం పొందే పద్ధతి : సంబంధిత కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి నుండి సమాచారం పొందడానికి తెల్లకాగితంపై దరఖాస్తు చేసి, నిర్ణీత రుసుము చెల్లించాలి. దరఖాస్తు స్వీకరించిన కార్యాలయ పిఐఓ 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. కోరిన సమాచారం వ్యక్తి స్వేచ్ఛ,జీవితంతో ముడిపడి ఉన్నట్లయితే 48 గంటల్లోగా ఇవ్వాలి. సమాధానం పొందడానికి సమాచారం కోరే వ్యక్తి ఎలాంటి కారణాలు చెప్పనవసరం లేదు.

*చెల్లించవలసిన ఫీజు : రాష్ట్ర కేంద్రంలో లేదా జిల్లాలలో గల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుండి సమాచారం పొందడానికి ఫీజుగా గ్రామ స్థాయిలో ఎట్టి ఫీజు లేదు. మండల స్థాయిలో రూ . 5/-, జిల్లా స్థాయిలో  రూ . 10/- లు నగదుగా గాని, పోస్టలు ఆర్డర్, డిడి, బ్యాంకర్ చెక్ ద్వారా చెల్లించాలి. యుటిఎఫ్.  ఎ4/13 సైజు పేపరు ద్వారా  సమాచారం పొందడానికి పేపరుకు రూ . 2/- చొప్పున, ఫ్లాపికి రూ 50లు, సిడికి రూ 100లు చెల్లించాలి. కేవలం రికార్డుల పరిశీలనకై మొదటి గంట ఉచితంగాను, తర్వాత ప్రతిగంటకూ 5లుచెల్లించాలి.

*సమాచారం నిరాకరిస్తే? : సమాచారం కోసం చేసిన దరఖాస్తుతిరస్కరించడం, కాలపరిమితిలోగా సమాచారం ఇవ్వకపోవడం, ఎక్కువ ఫీజు వసూలు చేయడం, దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత రికార్డులు మాయం చేయడం వంటి చర్యలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి యొక్క సమాచార నిరాకరణ క్రిందకు వస్తాయి.  సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిపై, వారిపై అధికారులైన డిపార్టుమెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి అప్పీలు చేసుకొన వచ్చును. లేదా నేరుగా రాష్ట్ర, కేంద్ర సమాచార కమీషనర్‌ కు ఫిర్యాదు చేయవచ్చును. తగిన కారణం లేకుండా కార్యాలయ పిఐఓ సమాచారం ఇవ్వడం నిరాకరిస్తే సంబంధిత అధికారికి రోజుకు రూ . 250లు చొప్పున రూ . 2500వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. శాఖాపరమైన చర్యలు కూడా సంబంధిత అధికారిపై తీసుకొన వచ్చును. కోర్టు పరిశీలనలో ఉన్న సమాచారం, కేబినేట్ మీటింగ్లు, రికార్డులు, మంత్రుల, కార్యదర్శుల నిర్ణయాలు, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే సమాచారం మాత్రం ఇవ్వడానికి నిరాకరించ వచ్చు. అయితే అవి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి అయితే తప్పక ఇవ్వాలి.

 *రాష్ట్ర కేంద్ర అప్పిలేట్ అధికారులు : రాష్ట్ర సమాచార కమీషనరుకు అప్పీలు చేసుకొనుటకు ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమీషన్ ను సంప్రదించాలి. కేంద్ర సమాచార కమీషనర్‌కు అప్పీలు ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ కు పంపాలి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top