Search This Blog

Monday, June 14, 2021

INCOME TAX 2020-2021


 INCOME TAX  2020-2021 ANALYSIS

◙నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 
◙మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం. 

1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో 
6,50,000-1,50,000 =5,00,000

2.5 లక్షల వరకు టాక్స్ = 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500 
కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా 
చెల్లించాల్సిన టాక్స్ = 0
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ =0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 6.5 లక్షల వరకు టాక్స్  1,50,000 X 10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ =27,500 
*****
2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో  
7,00,000-1,50,000 = 5,50,000

2.5 లక్షల వరకు టాక్స్ = 0
5 లక్షల వరకు టాక్స్         2,50,000 X 5% = 12,500
5.0 - 5.5 లక్షల వరకు టాక్స్  50,000 X 20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ = 22,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X    5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్  2,00,000 X    10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ = 32,500
****

3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో 
8,50,000-1,50,000 =7,00,000

2.5 లక్షల వరకు టాక్స్ = 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్  2,00,000 X 20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ = 52,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్  =0
2.5 - 5 లక్షల వరకు టాక్స్     2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X10% = 25,000
7.5-8.5 లక్షల వరకు టాక్స్   1,00,000 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ = 52,500  .    పాత కొత్త టాక్స్ లో తేడా లేదు
******
4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో  
9,00,000-1,50,000 =7,50,000
2.5 లక్షల వరకు టాక్స్ = 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ = 62,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X10% = 25,000
7.5-9.0 లక్షల వరకు టాక్స్  1,50,000 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ = 60,000
******
5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో  
12,50,000-1,50,000 =11,00,000
2.5 లక్షల వరకు టాక్స్ =0
5 లక్షల వరకు టాక్స్   2,50,000 X 5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్  5,00,000 X 20% = 1,00,000
10 - 11 లక్షల వరకు టాక్స్  1,00,000 X 30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్  = 1,42,500 
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్  2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్     2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ = 1,25,000 
*****
6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో 
16,00,000-1,50,000 =14,50,000  

2.5 లక్షల వరకు టాక్స్  = 0
5 లక్షల వరకు టాక్స్             2,50,000 X5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్   5,00,000 X20% = 1,00,000
10 - 14.5 లక్షల వరకు టాక్స్  4,50,000 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ = 2,47,500 
కొత్త విధానం లో 
2.5 లక్షల వరకు టాక్స్ =0
2.5 - 5 లక్షల వరకు టాక్స్      2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్   2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్      2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X20% = 50,000
12.5 - 15 లక్షల వరకు టాక్స్  2,50,000 X25% = 62,500
15.0 - 16 లక్షల వరకు టాక్స్  1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ = 2,17,500 

పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం .

6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.
DOWNLOAD :




    @    House Rent Receipt


******
*Income Tax పైన కొన్ని సందేహాలు-సమాధానాలు*

 ప్రశ్న : ప్రతీ నెల నా జీతం నుండి IT ని  మా DDO గారు cut చేయిస్తున్నారు. చాలా సంత్సరాల నుండి ఇలాగే చేస్తున్నాం.నేను టాక్స్ కట్టినట్ల కదా?

జ:   కాదు,  మీరు కట్టిన వేల రూపాయలు tax వృధా అవుతుంది. ఎందుకనగా మీ DDO గారు నీ పేరు మీదుగా cut చేసిన Tax వెళ్లి DDO TAN అకౌంట్ లో పడుతుంది.(Tan అనేది ఒకరకంగా జీరో Account లాంటిదే)  అక్కడే టాక్స్ జమ అయి ఉంటుంది .కానీ ప్రభుత్వం నకు నీ పేరు మీదుగా చేరకుండా Unknown గా ఉంటుంది.

ప్రశ్న : నేను కట్టిన టాక్స్ నా పేరు మీదుగా ప్రభుత్వం నకు చేరాలంటే ఏమి చేయాలి.

జ: ముందుగా మీ DDO గారి ద్వారా మీరు కట్టిన tax ను chalan no తొ పాటుగా నీ యెక్క PAN accountlo జమ చేయించుకోవాలి.దీన్నే TDS అంటారు. TDS process అయితేనే నీ PAN అకౌంట్లో నీవు కట్టిన టాక్స్ జమ అవుతుంది.

ప్రశ్న :  TDS చేయిస్తే నేను టాక్స్ కట్టినట్లేనా?

జవాబు:  కాదు. మీరు  ఈ -ఫైలింగ్ చేయించడం ద్వారా మీ టాక్స్ ను ప్రభుత్వం నకు కట్టినట్లు అవుతుంది.   చివరకు TDS-ఈ-ఫైలింగ్ అయ్యే కొద్దీ ఖర్చు కు వెనుకడుగు వేసి. వేల రూపాయల పన్ను ను చేతుల్లో నుండి జారవిడుచు కుంటున్నాం .పన్ను కట్టి కూడా కట్టని కోవలోకి వెళ్తున్నారు. ఆలోచించి సరయిన సమయంలో ప్రతిస్పందించండి.
మీరు ప్రతినెల కట్ చేయించిన టాక్స్ ని TDS చేయించుకుని .సరియైన సమయంలో ఈ-ఫైలింగ్ చేయిస్తేనే  మీరు ప్రభుత్వం దృష్టి లో  పన్ను చెల్లింపు దారులు కోవలోకి వస్తారు.

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవ‌కాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

👉1.పొదుపు / క‌రెంట్ ఖాతా: ఒక వ్యక్తికి, పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ. 1 లక్ష‌. పొదుపు ఖాతాలో ఒక ల‌క్ష రూప‌యాల‌కు మించి జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను నోటీసుకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

👉2. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు, రూ.1 లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు స‌మాధానం చెప్పాలి.

👉3.బ్యాంక్ ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్): బ్యాంక్ ఎఫ్‌డీలో నగదు డిపాజిట్ రూ. 10 లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంత‌కు మించి నగదు డిపాజిట్ చేయకూడ‌దు.


👉4. మ్యూచువల్ ఫండ్ / స్టాక్ మార్కెట్ / బాండ్ / డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్ లేదా డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు న‌గ‌దు పెట్టుబ‌డులు రూ.10 లక్షల పరిమితికి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితిని మించితే ఆదాయపు పన్ను విభాగం మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను తనిఖీ చేస్తుంది.


👉5. రియల్ ఎస్టేట్: ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్స‌హించ‌దు.


TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top