General Provident Fund
-: నియమ నిభందనలు :-
2) తేది 1-9-04 నాటి నుండి ఉద్యోగములో చేరినారు. జి.పి. యఫ్. స్కీం లో చేరుటకు అర్హులు కారు (G0.Ms.No.654 తేది 22-9-204)
3) జి.ఫి.యఫ్.అకౌంటులను చూసే బాధ్యత అకౌంటెంట్ జనరల్ అం.ప్ర, గారికి అప్పగించవైనది. పంచాయతీ రాజ్ సంస్థలలో పనిచేయు ఉద్యోగుల , ఉపాధ్యాయులు GPF అకౌంటులు మొత్తము జిల్లా పరిషత్తు CEO గారు నిర్వహిస్తారు.
4) ఈ GPF నుండి అప్పులు, పార్ట్ఫైనల్స్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి ఉన్నత పాఠశాల ప్ర.ఉ.లకు ఉపవిద్యాధికారి మంజూరు చేయవచ్చు. G0.Ms.No.40, dt.7-5-2002 .
5) ప్రతి ఉపాధ్యాయుడు/ఉద్యోగి తన వేతనము నుండి ప్రతినల కనీసము 6%నకు తగ్గకుండ స్రీమియం చెల్లించాలి. జి. పి. ఎఫ్ ప్రీమియంను సంవత్సరమునకు ఒకసారి తగ్గించవచ్చును. లేదా సంవత్సరమునకు రెండుసార్లు. పెంచవచ్చును. G0.Ms.No.21, d.24-1-81. ఈ ప్రీమియం రిటైర్మెంటుకు నాలుగు నెలల ముందు నిలుపుదల
చేయవచ్చు. ఇలా చెల్లించిన జి.పి.యఫ్.నిల్వలపై ఆయాకాలములలో వడ్డీ రేట్లు లభించును.
6) నామినీ : జి.పి.యఫ్.లో సభ్యులుగా చేరిన వెంటనే సర్వీసులో ఉండగా అనుకోని సంఘటనల ద్వార తనకు ఏమైన జరిగినచో అట్టి డబ్బును చెల్లించుటకై నామినీ ఫారము దాఖలు చేయాలి. ఈ నామినీ పేరును సర్వీసు పుస్తకములో ఎంట్రీ చేయించడము చాలా ముఖ్యము.
7) GPF నుండి అడ్వాన్సు: GPF లో నిలువయున్న మొత్తం నుండి ఈ క్రింది నింబంధనలకు లోబడి త్కాలికముగా రుణము పొందడానికి అవకాశము కలదు.
(ఏ ) ఈ రుణం ఉద్యోగి 3 నెలల జీతమునకు సమానమైన లేదా జమచేయబడిన డబ్బు నుండి 50% పై రెండింటి లో ఏది తక్కువయితే ఆ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయవచ్చు.
(బి ) ఒక ఉద్యోగి ఒక ఆర్ధిక సంవత్సరములో రెండుసార్లుGPF రుణం పొందవచ్చు
(సి ) తనకు లేదా తనపై ఆధారపడిన వారి సుదీర్ఘకాల చికత్స అవసరాల కొరకు, తనకు లేదా తనపై ఆధారపడిన వారి ఉన్నత విద్యకొరకు , విదేశాలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చులకోసం/, స్వదేశంలో ఉన్నత విద్యకొరకు.
(డి ) తనకు లేదా తమ పిల్లల నిశ్చితార్థం, వివాహములకు, జన్మదినవేడుకలకు, తనకుటుంబీకల అంత్యక్రియలకు
(ఈ ) ఉత్సవం నిర్వహణలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చుల కొరకు
(ఎఫ్ ) ఉద్యోగ విధినిర్వహణ సందర్భంగా తలెత్తిన ఆరోపణలను ఎదుర్కొనడానికి కావలసిన ఖర్చుల నిమిత్తమై.
(జి ) గృహనిర్మాణంలో భాగంగా స్థల సేకరణకు, గృహనిర్మణమునకై, గృహ రిపేరులకై అయ్యే ఖర్చుల కొరకై
(యచ్ ) ఉద్యోగ విరమణ తేదికి ఆరునెలల ముందు వ్యవసాయ భూములు మరియు వ్యాపారస్థలం కొనుగోలుకై
(ఐ ) ఒక మోటారు కారు కొనుగోలు కోసం GPF రుణం పొందవచ్చు
నిర్ణీత ప్రొఫార్మ యందు వినతిపత్రము రుణము పొందుటకు గల కారణములకు ఆధారములు జతపరుస్తూ జిపియఫ్ రుణము మంజూరు చేయు అధికారికి సమర్పించాలి. తీసుకున్న రుణము ఆరువాయిదాలకు తగ్గకుండ 24 వాయిదాలకు మించకుండ తిరిగి చెల్లించాలి. (G.O.Ms.397 Dt.14-11-2008 ).
8) పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్: 20 సంవత్సరాల సర్వీసును పూర్తిచేసుకున్న ఉద్యోగులు లేదా 10 సంవత్సరముల లోపల రి టైర్ అవుతున్న ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్లో నిలువయున్న డబ్బు నుండి పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ మొత్తాలను తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ఈ క్రింది కారణాల ఖర్చులకై పార్ట్ ఫైనల్ మంజూరి చేయవచ్చు.
(ఏ )కుమారుడు కుమార్తెల ఉన్నత విద్యాఖ్యాసం మరియు వివాహాల కొరకు.
(బి )ఆరోగ్యకారణాల వల్ల ఎదురయ్యే ఆరోగ్య, వైద్య, ప్రత్యేక ఆహార, ప్రయాణ ఖర్చులకై
(సి ) ఒకే కారణం కోసం రెండుసార్లు పార్ట్ ఫైనల్ చేసుకోవడానికి అవకాశం లేదు.
(డి ) గృహ సంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ మొత్తం పొందడానికి అర్హత కలదు. గృహ సంబంధ అంశాల విషయంలో అగ్రిమెంట్, బ్యాంకు వివరాల తో రెండు 10 రూపాయల బాండ్ పేపర్లు జతచేయాలి.
(ఇ ) ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లకు మించరాదు మరియు ఒక అడ్వాన్సుకు మరొక అడ్వాన్సుకు మధ్య ఆరు నెలల వ్యవధి తప్పక ఉండాలి రూలు 15-B Note-1
(యఫ్ ) రిటైర్ అవుతున్న ఉద్యోగి తన ఆఖరు నాలుగు నెలల ఉద్యోగ కాల సమయములో పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కు అవకాశం లేదు.
(జి ) పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అత్యవసర పరిస్థితుల బట్టి 6 నెలల జీతము లేదా 10 నెలల జీతమునకు సరిపడు డబ్బు లేదా విలువలోనున్న డబ్బు నుండి 75% వరకు మంజూరి చేయవచ్చును.(హెచ్ ) పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కి ఎలాంటి రికవరీ ఉండదు.
(ఐ ) G. O. Ms. No447 PR Dept. Dt.28-11-2013 ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు జి.పి.ఎఫ్ నిల్వలపై అప్పులు మంజూరు చేయు అధికారం హెచ్.ఎమ్/ఎం.ఇ.ఒ.లకు కలదు
(జె ) ప్రధానోపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి గతంలో వలెనే జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారే అప్పులు మంజూరు చేస్తారు. నిబంధనల ప్రకారం అప్పులు మంజూరు చేసి మంజూరు ఉత్తర్వులను, ఫారం-40ఎ తో జతచేసి జిల్లాపరిషత్ కు పంపుకుంటే వారు మంజూరైన సొమ్మును ఆన్లైన్లో బ్యాంకు ఖాతకు జమచేస్తారు .
గమనిక : తేది 1-9-04 తర్వాత ఉద్యోగములో చేరువారికి జిపిఎఫ్ వర్తించదు. అనగా జిపిఎఫ్ స్కీము కొత్తవారికి ఉండదు. (GO.Ms.654 తేది 22-9-2004). DSC 2002 వారికి జిపిఎఫ్ సౌకర్యము కలుగజేయబడినది. C&DSE Procs No.48857/D2-3/10, Dt.20-12-2010.
బూస్టర్ స్కీం:
@ రూలు 30(A) ప్రకారం GPF చందాదారుడు ఆకస్మికంగా మరణించిన సందర్భంలో అదనపు ప్రయోజనంగా మరణానికి 3 సంవత్సరాల ముందు తన ఖాతాలో గజిటెడ్ వారికి రూ.8,000 బ్యాలెన్స్, నాన్ గజిటెడ్ వారికి రూ.6,000, లాస్ట్ గ్రేడ్ వారికి రూ.2,000 కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటి వారికి G.O.Ms.No.42 F&P తేది: 29.1.2003 ప్రకారం సరాసరి నెల విలువకు రెండింతల మొత్తం రూ.20,000 మించకుండా చెల్లిస్తారు.
@ చనిపోయే రోజు వరకు ఉద్యోగి కనీసం 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి ఉండాలి
-: GPF నిల్వలపై ఆయాకాలములలో వడ్డీరేట్లు :-
కాలము వడ్డీ రేటు
- ఏప్రిల్ 1972 నుండి మార్చి 1974 వరకు : 6.00%
- ఏప్రిల్ 1974 నుండి జులై 1974 వరకు : 6.50%
- అగస్టు 1974 నుండి మార్చి 1977 వరకు : 7.50%
- ఏప్రిల్ 1977 నుండి మార్చి 1980 వరకు : 8.00%
- ఏప్రిల్ 1980 నుండి మార్చి 1981 వరకు : 8.50%
- ఏప్రిల్ 1981 నుండి మార్చి 1983 వరకు : 9.00%
- ఏప్రిల్ 1983నుండి మార్చి 1984 వరకు : 9.50%
- ఏప్రిల్ 1984 నుండి మార్చి 1985 వరకు : 10.00%
- ఏప్రిల్ 1985 నుండి మార్చి 1986 వరకు : 10.50%
- ఏప్రిల్ 1986 నుండి మార్చి 2000 వరకు : 12.00%
- ఏప్రిల్ 2000 నుండి మార్చి 2001 వరకు : 11.00%
- ఏప్రిల్ 2001 నుండి మార్చి 2002 వరకు : 9.50%
- ఏప్రిల్ 2002 నుండి మార్చి 2003 వరకు : 9.00%
- ఏప్రిల్ 2003 నుండి మార్చి 2009 పరకు : 8.00%
- ఏప్రిల్ 2009 నుండినవంబర్ 2011వరకు : 8.00%
- డిసెంబర్ 2011 నుండిమార్చి2011 వరకు : 8.60%
- ఏప్రిల్ 2012నుండి మార్చి 2013 వరకు : 8.70%
- అక్టోబర్ 2019 నుండి డిశంబర్ 2019 వరకు : 7.90%
- జనవరి 2020 నుండి మార్చ్ 2020 వరకు : 7.90%
- ఏప్రిల్ 2020 నుండి జూన్ 2020 వరకు : 7. 1%
************
@ AG GPF Slips Website : https://ag.ap.nic.in/SlipsGpf.aspx
@ TS ZPGPF Slips Website : https://epanchayat.telangana.gov.in/zpgpf/
( User Id : Your GPF Number , Password : emp gpf number )
Ex: User Id : 12345 Password : emp12345
* G.O.Ms.No. 56 dt.28.02.14 APGPF Modification of Form Appendix_S and Proposal New Form
* G.O.Ms.No. 447 dt.28.11.13 Delegation powers to PGHMs and MEOs to sanction ZPGPF Loan and Partfinal
* Memo.7745 ZPPF Loans Sanction Powers Deligation Orders communicated to ZP CEOs
* Memo:No.4942 dt: 27.4.2020 Bifurcation of ZPGPF Accounts among New Districts
@ General Provident Fund Rules 1935
@ ZPGPF MISSING CREDITS PROFORMA
@ ZPGPF MISSING CREDIT COVERING LETTER
@ ZPGPF Loan and Part Final Model Proceedings/Forwarding Letter/Check List
**********
Related GOs & Proc :
* G.O.Ms.No. 447 dt.28.11.13 Delegation powers to PGHMs and MEOs to sanction ZPGPF Loan and Partfinal
* Memo.7745 ZPPF Loans Sanction Powers Deligation Orders communicated to ZP CEOs
* Memo:No.4942 dt: 27.4.2020 Bifurcation of ZPGPF Accounts among New Districts
@ General Provident Fund Rules 1935
For More GOs & Proc............... GOs DIARY
Applications & Formats :
@ ZPGPF MISSING CREDIT COVERING LETTER
@ ZPGPF Loan and Part Final Model Proceedings/Forwarding Letter/Check List