Search This Blog

Monday, June 14, 2021

Foreign Services

FOREIGN SERVICES 

1. ప్రభుత్వ ఉద్యోగి బదిలీ పై ఇతర సర్వీసులకు వెళ్లినప్పుడు అతని జీతభత్యాలు రాష్ట్రాల సంఘటిత నిధి నుండి లేదా కేంద్రప్రభుత్వ సంఘటిత నిధి లేదా కేంద్రపాలిత ప్రాంత సంఘటిత నిధి లేక కేంద్ర పాలిత నిధి నుండి కాకుండా ఇతర నిధుల ద్వారా చెల్లింపులు జరిగితే దానిని "ఫారిన్ సర్వీసు" అంటారు.

2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్ మెమో నెం. 22777 / 113 / FR-II / 12, తేది : 11-9-2012లో డిప్యుటేషన్ మరియు ఫారిన్ సర్వీసును ఈ క్రింది విధంగా నిర్వహించడం జరిగింది.

3. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగి, స్వతంత్ర సంస్థలు, కార్పొరేషన్లకు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు లేక ఇతర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు బదిలీ చేస్తే దానిని "ఫారిన్ సర్వీసు" అంటారు. FR లో 110 నుండి 126 వరకు తెలిపిన నిబంధనలు వర్తిస్తాయి. ఆయా సంస్థలు లీవ్ శాలరీ మరియు పెన్షన్ కంట్రిబ్యూషన్లు తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాలి.

4. తెలంగాణ రాష్ట్ర ఒక డిపార్ట్ మెంట్ ఉద్యోగి తన ప్రభుత్వంలోని ఇతర డిపార్టమెంట్ కు బదిలీ అయితే దానిని డిప్యుటేషన్" అంటారు. ఇటువంటి బదిలీలకు FR110 నుండి 126 వరకు తెలిపిన నిబంధనలు వర్తించవు. ఆయా డిపార్ట్ మెంటల్ లీవ్ శాలరీ మరియు పెన్షన్ కాంట్రిబ్యూషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు.

5. ఫారిన్ సర్వీసు సంబంధించిన నియమ నిబంధనలు ఫండమెంటల్ రూల్స్లోని పార్ట్ - IV, చాప్టర్ - XII లో తెలిపిన రూల్స్ 110 నుండి 127 వివరించడం జరిగింది.

6. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా తన ఇష్టానికి వ్యతిరేకంగా ఫారిన్ సర్వీసు ఉద్యోగానికి బదిలీ చేయరాదు. (రూల్ 110 (A))  సర్వీస్ సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంటే ఆ సంస్థకు బదిలీ చేయడానికి పై నిబంధన వర్తించదు.

7.  విదేశాలలో ఫారిన్ సర్వీస్ పై బదిలీ చేయాలంటే భారత రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి (రూలు 110 (B).

8. |ఏదైనా రాష్ట్ర సర్వీసుకు సంబంధించిన ఉద్యోగిని ఇండియాలో ఫారిన్ సర్వీసుపై బదిలీ చేసే క్రమంలో రాష్ట్రపతి కొన్ని పరిమితులను విధించవచ్చు (రూలు 110(C).

9. పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్లు పరిధిలోని NGO లను స్థానిక సంస్థలు మరియు ప్రైవేటు సంస్థలకు ఫారిన్ సర్వీస్ పై బదిలీ చేయవచ్చు (రూలు 110 (C) (4)).

|10. శాఖాధిపతుల తన పరిధిలోని NGO లను జిల్లా పరిషత్తులు మరియు మండల ప్రజాపరిషత్లకు ఫారిన్ సర్వీస్ పై బదిలీ చేయవచ్చు (రూలు 110 (C) (9)).

11. ఫారిన్ సర్వీస్లో బదిలీ అయిన ఉద్యోగి ఆ ఉద్యోగంలో తన సర్వీసు ప్రజా సంక్షేమముకు లేక ప్రజా సంబంధిత కారణాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే ఉద్యోగిని ఫారిన్ సర్వీసుకు బదిలీ చేయాలి. రూలు 111 (A).

12. అంతేకాకుండా ఫారిన్ సర్వీస్ కు బదిలీ చేసే ఉద్యోగి తన ఉద్యోగంలో తన జీతభత్యాలు జనరల్ రెవిన్యూ నుంచి చెల్లించబడుతూ ఉండాలి. ఆప్పుడే ఆ ఉద్యోగిని ఫారిన్ సర్వీస్ కు బదిలీ చేయాలి. రూలు 111 (B).

| 13. ఎవరైనా ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఫారిన్ సర్వీస్కు బదిలీ అయితే ఆ రోజు నుండి ఆతని సెలవు రద్దు అవుతుంది. అలాగే సెలవు జీతం కూడా డ్రా చేయబడదు. రూలు 112.

14. ఫారిన్ సర్వీస్ కు బదిలీ ఆయిన ఉద్యోగి బదిలీ కంటే ముందు అతడు పనిచేసిన క్యాడర్లో ఉన్నట్లే భావించాలి రూలు 113.

15. ఫారిన్ సర్వీస్ కు బదిలీ అయిన ఉద్యోగి జీతభత్యాలు అతడు పాత ఉద్యోగాన్ని వదిలి పెట్టిన రోజు నుండి కొత్త పోస్టులో చెల్లించాలి. రూలు 114.

16. ఫారిన్ సర్వీస్ లో పనిచేసే ఉద్యోగి ప్రభుత్వ అనుమతి లేనిదే ఫారిన్ ఎంప్లాయరీ ద్వారా పెన్షన్ గాని గ్రాట్యుటీ గాని
పొందడానికి వీలులేదు. రూలు 121.

17. ఫారిన్ సర్వీస్ లో పనిచేస్తున్న ఉద్యోగి తిరిగి తన సొంత ఉద్యోగానికి బదిలీ ఆయితే అతని పే ఫిక్స్ చేయడానికి అతని సొంత పేను పరిగణనలోకి తీసుకోవాలి కానీ ఫారిన్ సర్వీస్లో అతను చేస్తున్న పేను పరిగణనలోకి తీసుకోరాదు. రూలు 124.

18.  ఫారిన్ సర్వీస్ నుండి ప్రభుత్వ ఉద్యోగానికి బదిలీ అయినచో ఆ రోజు నుంచి ఫారిన్ ఎంప్లాయర్ చేసే చెల్లింపులు అన్నీయు రద్దు అవుతాయి. (రూలు 126.)

19. ఫారిన్ సర్వీస్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి తన సొంత సర్వీసులో ఏ రూల్స్ ప్రకారం సెలవులు మంజూరు చేస్తారో దానికి భిన్నంగా సెలవులు మంజూరు చేయరాదు. (రూలు 122.)

20. ఫారిన్ సర్వీస్ నుండి ప్రభుత్వ సర్వీసుకు రివర్టు అయితే సర్వీస్లో తిరిగి చేరిన తేదీ నుండి ప్రభుత్వ సర్వీసుగా లెక్కిస్తారు. అయితే వెంటనే రిపోర్టు చేయకుండా సెలవులో ఉంటే ఆట్టి సందర్భంలో ఆతని రివర్షన్ తేదీని సంబంధిత సెలవు మంజూరు అధికారి నిర్ణయించాలి. (రూలు 125.)

21. మొత్తము డిప్యుటేషన్ కాలం 5 సంవత్సరాలకు మించరాదు. మొట్టమొదటి 3 సంవత్సరాలు అనుమతించాలి. ఇలా అనుమతించడానికి HOD అధికారంలో ఉంటే ఉత్తర్వులు ఇవ్వాలి లేకపోతే ప్రభుత్వ అనుమతి పొందాలి.

22. 3 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు డిప్యుటేషన్ పంపాలంటే (మరో 2 సంవత్సరాలు) ప్రభుత్వ అనుమతి పొందాలి.

23. LTC, Education Concession, T.A, Jaining Time, Deputation చేరినపుడు బదిలీ అయినప్పుడు ప్రభుత్వ రేట్ల ప్రకారం ఫారిన్ ఎంప్లాయిర్ చెల్లించాలి.

24. ఎట్టి పరిస్థితుల్లోను డైరెక్ట్గా నియామకమైన ఉద్యోగి ప్రాబేషనర్ కాకుంటే అతడిని పారిన్ సర్వీసుకు డిప్యూట్ చేయరాదు .  G.O.Ms. No. 343F & P, dt : 30-9-1994.

25. కొన్ని సందర్భాలలో ఫారిన్ సర్వీస్ కు డిప్యుటేషన్ పై వెల్లిన ఉద్యోగి సరిగా పనిచేయకపోతే అతనిని పేరంట్ డిపార్ట్ మెంట్ కు వెనక్కు పంపుతుంటారు. అట్టివారి విషయంలో టెన్యూర్ ఆ సంవత్సరం పూర్తయ్యేంత వరకు కొనసాగించాలి. CIr Memo No. 12543/129/ A2/ FR - ||/2002, dt : 22-2-2003.

26. ప్రభుత్వ ఉద్యోగులను ఫారిన్ సర్వీస్లో డిప్యుటేషన్ పై పంపడానికి సంబంధించిన విధి విధానాలను G.O.MS. No.Fin, తేది : 2-1-2010లో తెలపడం జరిగింది.

27. ఫారిన్ సర్వీసు 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వారు తిరిగి ఫారిన్ సర్వీసులో డిప్యుటేషన్ పై వెళ్లాలంటే కనీసం 1 సంవత్సరం పేరెంట్ డిపార్ట్ మెంట్లో పనిచేస్తేనే అనుమతించాలి.

28. ఫారిన్ సర్వీస్ లో డిప్యుటేషన్లో పంపేటప్పుడు G.O.Ms.No. 610, GAD, తేది : 31-12-1985లో తెలిపిన నిబంధనలు పాటించాలి •

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top