Search This Blog

Monday, June 14, 2021

CONTRIBUTORY PENSION SCHEME(CPS)

CONTRIBUTORY PENSION SCHEME 

 ఈ నూతన పెన్షన్ విధానము ది: 1.9.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెం.653, 654, 655, తేది: 22.9.2004 ప్రకారంగా ది:1.9.2004 నుండి ఉద్యోగము నందు చేరిన ప్రతివారికి అమలులోకి తీసుకొనివచ్చినది .ఈ స్కీములో చేరిన వారికి ZPPF A/c and GPF A/c లు తెరువబడదు.
ముఖ్యంశాలు : 
@   దివి : 1. 9.2004 నుండి ఉద్యోగంలో చేరిన ప్రతివ్యక్తి ఈ స్కీం  నందు నిర్భంధంగా (టైర్-1) ఒక మెంబరుగా చేరి ప్రతినెల జీతము (బేసిక్ పే + డీఏ) మొత్తముపై 10 కంట్రిబ్యూషన్ ను జనరల్ ఫ్రానిడెంట్ ఫండ్ మాదిరిగా సంబంధిత డి.డి.వో లు విధిగా జీతం గాని, ఎరియర్ జీతము నుండి రికవరి చేసి క్రింద తెలుపబడిన పద్దులకు జీవో ఎం.ఎస్.నెం.-151 తేదీ: 2.7.2007 ప్రకారం జమ చేయుదురు
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కంట్రిబ్యూషన్: •
8342 -  Other Deposit
117   -  Defined Contribution Pension Scheme for Govt. Employees
04     - TS State Govt. Employees Contributory Pensions Scheme
001  -  Emplayees Contribution
002   - Govt. Contribution

@   పై విధంగా ఒక ఉద్యోగి కంట్రిబ్యూషన్ చేసిన మొత్తమునకు అంతే మొత్తమును క్రింద తెలుపబడిన పద్దులకు జీవో ఎం.ఎస్.నెం. 151 తేదీ: 2.7.2007 ప్రకారంగా జమ చేయబడును.
2071  -  Pension & Other Retirement Benefits
001    -  Civil
117    -  Contribution to contributory Pension
320    -  Contribution

AP State Aided Education Institution of Head of Account

8332  -  Other Deposits
117    -   Contributory pension scheme
SH(05) - TS Aided Educational Institution Employees
001 - Empoyees contribution
002 - Govt Contribution

@    పై విధఃగా జమ  చేయబడిన మొత్తమును విత్డ్రా చేయటానికి వీలులేని టైర్-1 అకౌంట్ లో వుంచుతారు. పై విధంగా నిర్భంధంగా ఉండే టైర్-1 అకౌంట్ కాకుండా అదనంగా టైర్-2 అకౌంట్ను ఎంచుకొని కంట్రిబ్యూట్ చేసుకొని, అందులో జమ చేయబడిన మొత్తం నుండి ఉద్యోగి ఇష్టపడినపుడు తన అవసరాల కోసం ఈ సొమ్మును   withdrawal చేసుకొను అవకాశం కలదు.

@  పై విధంగా జమ చేయబడిన మొత్తము నోడల్ అధికారుల ద్వారా (DDO/STO/DTO) New Penaion Scheme ContrIbution Acoounting Network ద్వారా నేరుగా Trustee Bank (Axis) నందు సంబంధిత ఉద్యోగి యొక్క PRAN A/C నందు  జమచేయబడి, PFRDA నియమించబడిన క్రింద తెలుపబడిన 3 PFMS (Pension Fund Managers) నందు క్రింద తెలుపబడిన ప్రకారంగా పెట్టుబడి పెట్టును
(1) LIC Pension Fund    :  31%
(2) SBI Pension Fund Pvt. Ltd.     :   40%
(3) UTI Retirement Solution Ltd.   :  29%
పై విధంగా కేటాయించబడిన మొత్తం 85% ఎఫ్.డి. నందు మిగిలిన 15% ఈక్విటి షేర్స్ నందు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.

@  పై విధంగా జరిగే లావాదేవీలను చూచుటకు గాను ది: 21.11.2008 కుదిరిన ఒప్పందం మేరకు Central Record
Keeping Agency అయిన  National Security Depository Limited Bombay వారికి పూర్తిగా అప్పగించబడింది .
@  దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని డిపార్టుమెంట్ లకు  డి.డి.ఓ.లకు , రిజిస్ట్రేషన్ సెంటర్లను PPPP వారు కేటాయించారు.

@  దీనిలో భాగంగా ఉసాధ్యాయులకు CPS Index Number స్థానంలో నూతన కేటాయింపే PRAN No. (Pemanent Retirement Account Number) కేటాయింపు,  Master Details మార్పు కోసం, Duplicate PRAN కొరకు మన రాష్ట్రం నందు NSDL, Bombay వారు క్రింద తెలుపబడిన  Facility Centre ను  ఏర్పాటు చేశారు.
                                               
Karvy Consultant Limited                                                 
8-2-60/K, Avenue H                                                         
Stree t No.1 Road No.10                                                   
Opp:Bank of Baroda                                                         
Near HSBC, Banjara Hills                                             
Hyderabd                                                                           
040-23512454                                                                 

@  CPS వర్తించే ప్రతిఉపాధ్యాయుడు విధులలో చేరిన వెంటనే ట్రెజరీ ఐడీ నెం. పొందిన వెంటనే S1 ఫారం ద్వారా PRAN A/c. No. కోసం Facility Center కు సంబంధిత నోడల్ ఆఫీసర్స్ ద్వారా (DDO/STO) పంపుకొని PRAN KIT విధిగా పొందాలి .

@  అదేవిధంగా మాస్టర్ డిటైల్స్ మార్పుకోసం మరియు Deposte PRAN CARD కొరకు S2 ద్వారా పంపుకొని సవరించుకోవాలి.

@  PRAN KIT ద్వారా వచ్చే 1-PINT-PIN పూర్తిగా మరచిపోయిన సందర్భంలో వెబ్సైట్ ద్వారా Relssue of I-PIN తిరిగి పొందే అవకాశము కలదు.

.@  అదేవిధంగా టోల్ స్రీ నెం. 1800-220-080 ద్వారా Re-issue of T-PlN ను పొందవచ్చును.

@  ఎప్పటికప్పుడు జరుగు మార్పుల కొరకు  https://cra-nsdl.com/CRA/ మరియు www.pfrda.org.in అధికారిక వెబ్సైట్ను చూడవచ్చును.

CPS Employees Login ( Click Here )

CPS Annual Transaction Statement ( Click Here )



ఉపసంహరణ: ఈ ఖాతా నందు జమ చేయబడిన మొత్తమునకు ప్రస్తుతము లోన్ సౌకర్యం లేదు 3 రకాలైన ఉపసంహరణలకు మాత్రమే అవకాశం కలదు. జీవో నెం.62 తేదీ: 7.3.2014 ద్వారా విధినిధానాలను పొందుపరచటమైనది.

1. ఉద్యోగి పదవీ నిరమణ (Retirement): ప్రభుత్వ ఉద్యోగి 58 సం॥ల సర్వీసు పూర్తిచేసిన, తదుపరి నిల్వయున్న మొత్తం నుండి 60% మాత్రమే చెల్లించబడును. మిగిలిన 40% (ఐ.ఆర్.డి.ఎ) వారు సూచించిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడి పెడతారు. దానిని 70సం॥ల వయస్సు వరకు ప్రతినెల పెన్షన్ రూపంలో  చెల్లించబడును. 70 సం॥ల తదుపరి మిగిలినది చెల్లిస్తారు. ఒకవేళ మరణించినచో నామినీకి చెల్లించెదరు. దీనిని క్లైయిమ్ చేయుటకు గాను సంబంధిత 101 జీఎస్ ప్రొఫార్మా ద్వారా విధివిధానాల ప్రకారంగా దరఖాస్తు చేసుకొవాలి .

2. రాజీనామా (Resignation):  రాజీనామా నాటికి అకౌంట్ నందు నిల్వయున్న మొత్తం నుండి 20% మాత్రమే చెల్లించబడును. మిగిలిన 80% పెన్షన్ రూపంలో చెల్లించబడును. దీనిని క్లైయిమ్ చేయుటకు గాను సంబంధిత 102 జీసి ప్రొఫార్మా ద్వారా విధివిధానాల ప్రకారంగా దరఖాస్తు చేసుకోవాలి.

3. సర్వీసులో మరణం (Death): సర్వీసులో ఉండగా మరణించినట్లయితే నామినీకి నిల్వయున్న మొత్తం 100% చెల్లించబడును. దీనిని క్లైయిమ్ చేయుటకు గాను సంబంధిత 103 జీడి ప్రాఫార్మా ద్వారా విధినిధానాల ప్రకారంగా  దరఖాస్తు చేసుకొవాలి.
సైన తెలుపబడిన ఉపసంహరణలు, క్లెయిమ్ లను  సంబంధిత డి.డి.ఓ.ల ద్వారా క్రింద తెలుపబడిన వారికి పంపుకోవలెను .

CRA ADDRESS:
NSDL e-Governance Infrastructure Limited,
1st Floor, Time Tower,
Kamala Mills Compound,
Senapati Bapat Mark,
Lower Parel, Mumbai-400 013,
Tel(022)2499 4200
CRA call centre:1800 222 990

PFRDA Address:
Pension Fund Regulatory & Dev. Authority,
1st floor, ICADR Building,
Plot No.06,
Vasant Kunj
Institutional Area, Phase-Il, New Delhi 110070.
Tel: +91-11-26897948/49, Fax: 91-11-26897938, Call: 1800 110 708.

********


*సిపిఎస్ ఫండ్ పాక్షిక ఉపసంహరణ* 
*(CPS Fund partial withdrawal)*

 @  కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో జమ అయిన ఉద్యోగుల పెన్షన్ ఫండ్ పాక్షిక ఉపసంహరణ (పార్షియల్ విత్ డ్రాయల్) నిబంధనలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (పిఎస్ఆర్ డీఏ) సర్క్యులర్ నం. పిఎస్ఆర్డీఏ/2018/40/ఎగ్జిట్; తేది. 10.01.2018 ద్వారా జారీచేసింది.

 @    ఈ సర్క్యులర్ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ క్రింది మినహాయింపులు మరియు ఉపసంహరణ) (మొదటి సవరణ) రెగ్యులేషన్స్ 2017 www.egazette.nic. in వెబ్ సైట్ నందు పబ్లిష్ చేయబడింది.

@   ది.21.03.2016లో పబ్లిష్ చేయబడిన సర్క్యులర్ సవరించబడి సిపిఎస్ ఫండ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలు సరళీకృతం అయ్యాయి. సవరించబడిన ఈ మొదటి సవరణ సర్క్యులర్ ది. 10.08.2017 నుండి అమలులోకి వస్తుందని తెలియ జేయబడింది.

@  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ క్రింద మినహాయింపులు మరియు ఉపసంహరణ) (మొదటి సవరణ) రెగ్యులేషన్స్ 2017లోని రెగ్యులేషన్ 8 ప్రకారం జాతీయ పెన్షన్ సిస్టం (ఎపిఎస్) క్రింద పాక్షిక ఉపసంహరణలు (Partial withdrawals) ఈ క్రింది నిబంధనల మేరకు అనుమతిస్తారు.

 @ పాక్షిక ఉపసంహరణకు చందాదారుడు దరఖాస్తు చేసిన నాటికి చందాదారుడు చెల్లించిన మొత్తానికి 25% మించని మొత్తాన్నిమాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ వాటాగా చెల్లించవలసిన 10% మొత్తం నుండి పాక్షిక ఉపసంహరణకు అనుమతించరు.

*A) పాక్షిక ఉపసంహరణకు  షరతులు:
ఎ) చందాదారుని పిల్లలు (లేదా) చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి
బి) చందాదారుని పిల్లలు లేదా చట్టబద్ధంగా దత్తత పొందినపిల్లల వివాహం కొరకు ,
సి) చందాదారుడు సొంతంగా కాని లేదా జీవిత భాగస్వామితో గాని కలిసి నివాసగృహం లేదా ప్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం కొరకు (పూర్వికుల ఆస్తి కాకుండా చందాదారుడు వ్యక్తిగతంగా కాని ఉమ్మడిగాని గృహం లేదా ఫ్లాట్ కలిగి ఉంటే ఉపసంహరణకు అనుమతించరు)
డి) చందాదారుడు లేదా జీవిత భాగస్వామి, పిల్లలు, దత్తత పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులు ఈ దిగువ వ్యాధులతో
అనారోగ్యమునకు గురై చికిత్స పొందు చున్నప్పుడు వైద్య చికిత్సలకొరకు
(1) క్యాన్సర్ (2) కిడ్నీ ఫెల్యూర్ (3)ప్రైమరీ పల్మనరీ ఆర్టెరియల్ హైపర్టెన్సన్ (4) మల్టిపుల్ సిరోసిస్ (5) మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ (6)కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (7) ఆర్టో గ్రాఫ్ సర్జరీ (8) హార్ట్ వాల్వ్ సర్జరీ  (9) స్ట్రోక్ (10) మయో కార్డియల్ ఇంఫోర్బన్ (11) కోమా(12) అంధత్వం (13)పక్షవాతం (14) యాక్సిడెంట్ (15)ప్రాణాపాయం కలిగించే ఇతర వ్యాధులు.

*B) పాక్షి ఉపసంహరణకు  పరిమితులు:
పాక్షిక ఉపసంహరణ చందాదారుడు ఈ క్రింది పరిమితులకు లోబడి అనుమతిస్తారు.
ఎ) చందాదారుడు జాతీయ పెన్షన్ పథకంలో చేరిన తేదీ నుండి మూడు సంవత్సరములు పూర్తి అయి ఉండాలి.
బి) చందాదారుడు దరఖాస్తు చేసిన నాటికి చందాదారుడు చెల్లించిన మొత్తానికి 25% మించని మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు.

*C) గరిష్ట కాలపరిమితి:
జాతీయ పెన్షన్ పథకం కాలపరిమితి ముగిసేలోపు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.  పాక్షిక ఉపసంహరణకై చందాదారుడు సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ (సిఆర్ఎ) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్టు తగిన దృవీకరణ పత్రాలతో నోడల్ అధికారి ద్వారా దరఖాస్తు చేయాలి. చందాదారుడు ఏదేని అనారోగ్యంతో బాధ పడుచున్న సందర్భంలోవారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయవచ్చు.

*D) పాక్షిక ఉపసంహరణ విధానము:
చందాదారులు తమ పాక్షిక ఉపసంహరణ (పార్షియల్ విత్ డ్రాయల్) కొరకు FORM 601PW ఉపయో గించాలి. గతసర్క్యులర్ లో ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తించు మార్గదర్శ కాలే పాక్షిక ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తిస్తాయి.



CPS Employee Partial withdrawal Online Process

 CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం

@ 1.nsdl cra వెబ్సైట్ లోకి వెళ్ళాలి

@ 2.వారి pran no, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి

@ 3.అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో partial విత్ డ్రా కు వెళ్ళాలి.

@ 4.ok సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి

@ 5.ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి

@ 6.ఈ అప్లికేషన్ తో పాటు...ddo గారి కవరింగ్ లెటర్,హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..మెడికల్ సర్టిఫికెట్(అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ xerox, వారి ఆధార్ xerox

@ 7.ఈ రెండు కాపీ లలో ddo గారి sign తీసుకోవాలి

@ 8.వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది

@ Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు

@    S2 - FORM : Subscribers Details Change పై పూర్తి సమాచారం 

**********
PRAN ACCOUNT లో కొత్త గా వచ్చిన OPTION

@ ABOUT BANK DETAILS IN PRAN ACCOUNT

దీని ప్రకారం మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవచ్చు.

Case:-    A) మీ ప్రాణ్ అకౌంట్లో బ్యాంక్ డీటెయిల్స్ లేకపోయినా

            B) మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ సాలరీ అకౌంట్ కొత్త బ్యాంకుకి మారినప్పుడు మీ ప్రాణ్ అకౌంట్ లో పాత బ్యాంకు డీటెయిల్స్ ఉంటే

పై రెండు సందర్భాల్లో ఈ క్రింది విధంగా  చేయవలెను.

Step :-1 
మీరు మీ ప్రాన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి

అక్కడ కనిపించిన demographic changes ను ప్రెస్ చేయాలి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి.

Step:-2 
వీటిలో రెండో ఆప్షన్ bank details update ను press చేయండి

ఇప్పుడు bank account number, IFSC code, bank address లను పూర్తి చేయండి.

Step :-3 
ఇప్పుడు bank passbook , cancelled cheque , bank certificate ల లో   ఒకదాని photo upload చేసి confirm చేయండి.

Step:4 
e sign verification అని వస్తుంది . దీని కంటిన్యూ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ డౌన్లోడ్ అవుతుంది.

ట్రెజరీ వారు authorise  చేసినాక మీకు బ్యాంక్ డీటెయిల్స్ మారతాయి.

Condition.

మీ ఆధార్ నెంబర్ కి మీ ఫోన్నెంబర్ లింక్ అయి ఉండాలి.
*******


Related GOs & Proc  :


* For More avalable at ------ GOs Diary

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top