Search This Blog

Monday, June 14, 2021

Casual Leave

*సాధారణ సెలవు -నియమ నిబంధనలు*
*(CASUAL LEAVE RULES)* 

💢ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది .

💢 ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు.

💢 ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి.
*(G.O.Ms.No.52 Dt:04-02-1981)*

💢 సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు.
*(G.O.Ms.No.2465 Fin Dt:23-12-1959)*
*(G.O.Ms.No.2094 Fin Dt:22-04-1960)*

💢 ఒక క్యాలెండర్ సం॥ లో 5 ఆప్షనల్ హాలిడేస్ ను,3 లోకల్ హాలిడేస్ ను వినియోగించుకోవచ్చును.లోకల్ హాలిడేస్ అకాడమిక్ సం॥ వాడుకోవాలి.
*(G.O.Ms.No.1205 Edn Dt:23-10-1981)*

💢 సెలవు నియమావళి ప్రకారం అర్ధజీత, సంపాదిత, జీతనష్టపు సెలవుతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని సాధారణ సెలవును  జతపరుచుటకు వీలులేదు.

💢 సెలవు అనేది హక్కుగా పరిగణించరాదు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంజూరుచేసే అధికారికి ఏ రకమైన సెలవునైనా సహేతుక కారణాలతో నిరాకరించుటకు లేదా మధ్యలోనే రద్దుచేయుటకు విచక్షణాధికారం ఉంటుంది- *FR-67*

💢 అర్ధ రోజునకు కూడా సాధారణ సెలవు మంజూరు చేయవచ్చును.అయితే ఒంటిపూట బడుల విషయంలో వీలుపడదు.
*(G.O.Ms.No.112 Fin Dt:03-06-1966)*

💢 విధినిర్వాహణ ద్వారా మాత్రమే సెలవు సంపాదించబడుతుంది *FR-60*

💢 సెలవు లేకుండా డ్యూటీకి గైర్హాజరు కారాదు. నిబంధనల ప్రకారం సెలవు గాని,పర్మిషన్ గాని ముందస్తు అనుమతితోనే వినియోగించుకోవాలి.ఎట్టి దరఖాస్తు పంపనపుడు ప్రధానోపాధ్యాయుడు * గైర్వాహాజరు * హాజరు పట్టికలో నమోదు చేయవచ్చును-
*A.P.E.R Rule-155*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top