Search This Blog

Monday, June 14, 2021

మెడికల్ ఇన్వాలిడేషన్

మెడికల్ ఇన్వాలిడేషన్

    1.అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు
కలిగియుండి,ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర,దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య
నియామకము చేస్తారు.

(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)

(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)

(A.P Pension code volume-I, Article-441)

❇తదుపరి ఒక కేసులో రాష్ట్రఉన్నతస్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దుపరచింది.

❇ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుమేరకుప్రభుత్వం మరలా మెడికల్ఇన్వాలిడేషన్ పై  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)

✂ ఎవరు అర్హులు: ✂

కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.

❇ భార్య/భర్త, కుమారులు,కూతుళ్ళు , చట్టరిత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు
ముందుగా తీసుకునియుండాలి.

❇అవివాహిత కూతురు,విధవరాలైనకూతురు,విడాకులు పొందిన కూతురు.

మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు

❇మెడికల్ ఇన్వాలిడేషన్  కోరు ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.

❇సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సులనిమిత్తం పంపబడుతుంది.

❇ జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.
(G.O.Ms.No.35 తేది:10-04-2000)

❇మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగి రిటైరైన తేదినుంచిఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

❇ నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత,అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములుఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి.

❇ మెడికల్ బోర్డు నివేదిక  అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.

❇ జిలాస్థాయి కమిటీ:

    1.జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు(CHAIRMAN)

    2.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు

    3.సంబంధిత జిల్లా శాఖ అధికారి-సభ్యుడు/కన్వీనర్

❇శాఖధిపతి(Head of the Department)కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖాలలో
పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది

❇ మెడికల్ ఇన్వాలిడేషన్
పథకం క్రింద,కారుణ్య నియామకాలు,యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు.

❇భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.

❇ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు.   మెడికల్ ఇన్వాలిడేషన్(అనారోగ్య కారణాలపై)వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్,కమ్యూటేషన్ అవకాశములేదు.   మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు.

❇ ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చు:

క్రింద తెలిపిన ఏదేని జబ్బులతో రోగపీడితులుగా ఉన్న ఉద్యోగిమెడికల్ఇన్వాలిడేషన్ పై మెడికల్ బోర్డు
నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.

    1.పక్షవాతము(PARALYSIS):           

        A)నాలుగు అవయవములు-కాళ్ళు,చేతులు

        B)ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము

        C)క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు

    2.అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము(END STAGE RENAL DISEASE)

    3.అంతిమదశలో ఉన్న కాలేయ రోగము(END STAGE LEVER DISEASE)

    4.క్యాన్సరు(CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)

    5.మానసిక సంబంధితము(DEMENTIA-MENTAL DISORDER)

    6.తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు(SEVERE PARKINSON DISEASE)

❇ మెడికల్ ఇన్వాలిడేషన్  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు (GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009)

    1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:

    2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ-హోదా-జీతపు స్కేలు:
 
    3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగాఉన్నాయా:

    4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:

     5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:

    6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ  చేయు తేది:

    7.రోగ వివరములు:

    8.అట్టి రోగము ప్రభుత్వ ఉత్త్ర్వులు G.O.Ms.No.661, తేది:23-10-2008 లో తెలిపిన మేరకు కలిగియున్నదా:

    9.ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా,అయితే ఏ తేదినుంచి  అట్టి సెలవుపై అట్టి             రోగ చికిత్స నిమిత్తం ఉన్నారు:

    10.మెడికల్ బోర్డు వారి సిఫార్సులు(ORIGINAL) సిఫార్సు జతపరిచారా:

    11.శాఖాపర విశ్లేషణ-సిఫార్సు       

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top