*ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడి నప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ గ్రేడు, 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్డ్ పే స్కేల్సు, మొ,, వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయబడుచున్నది.*
*అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్పు 24, 26, 27ననుసరించి చేయబడతాయి.*
*F.R.22(a) (i)* : అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి *'తదుపరి పై స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగును.* *అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.*
ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940 - 78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించబడుతుంది.
*F.R.22(a) (ii)* : *అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి “దిగువస్టేజి' వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది.* అయితే -
*ఎ) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచోఅట్టి 'సమాన స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.*
ఉదా: *21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు వేతనం పొందుతున్న ఉద్యోగి 28, 940 - 78,910 స్కేలు లో నియమించబడినప్పుడు అతని వేతనము రూ 30,580ల వద్దనే స్థిరీకరించబడుతుంది.*
*బి) ఒకవేళ పాత స్కేలులోని మూలవేతనమునకు సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసము 'పర్సనల్ పే'గా నమోదు చేయబడుతుంది. పాతఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.* (93, 99,05, 10, 15 స్కేళ్ళలో అన్నీ సమాన స్టేజీలే వుంటాయి.*
*సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.*
ఉదా : *రూ. 21,230-63,010 స్కేలులో రూ. 25,840/-లు పొందుచున్నచో, 28,940-78,910 స్కేలులో రూ. 28,940/- వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది.*
*F.R.22(a) (iv)* : ఉద్యోగి *పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.*
*F.R.22 B*: నిబంధన ననుసరించి *వేతన స్థిరీకరణ రెండువిధములుగా చేయవచ్చును. వాస్తవ ప్రమోషన్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటుతేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును.*
*జిఓ.ఎంఎస్.నం. 145, తేది. 19.05.2009 ప్రకారము ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.*
ఉదా: *21,230-63,010 స్కేలులో రూ. 28,120/-లు వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/-లుగా ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ. 820/-లు కలిపి వేతనాన్ని రూ 28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ 30,580/-లుగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.*
*FR 31 (2)*: నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. *దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది.* (లాభకరమైనప్పుడు)
ఉదా : *21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940 - 78,910 స్కేలులో రూ. 31,460/-ల వద్ద స్థిరీకరణ జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ. 31,460/-లుగా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది.*
*F. R. 26*: నిబంధన ననుసరించి *వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటు మంజూరుకు - ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్య కారణముపై గాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపై గాని పెట్టిన జీతనష్టపుసెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించ బడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు.*
*FR 27*: నిబంధన ననుసరించి *జూనియర్ కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో- ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ప్రీపోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరు చేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును.*
*అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దాఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును.*
*ప్రీపోన్మెంట్ తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.*
*F R 24* : నిబంధన అనుసరించి *దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నట్టి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును.*
*ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును.* ఈ నిలుపుదల
*రెండు విధములు - 1. క్యుములేటివ్ ఎఫెక్టుతో - అనగా ప్రతి సంవత్సరము నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.*
*2. క్యుములేటివ్ ఎఫెక్టు లేకుండా - అనగా ఆ ఒక్క సంవత్సరమునకు మాత్రమే నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.*