*🧾22 డిసెంబర్ 2024*
*నేడు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా...✒️*
*❇భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన గొప్ప మేధావి రామానుజన్*
*🔷️పూర్వ కాలం నుంచి మనదేశం గణితానికి ప్రసిద్ధి. దేశంలో భాస్కరాచార్యులు వంటి వారు గణితానికి గట్టి పునాదులు వేశారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులలో శ్రీనివాస రామానుజన్ అగ్రగణ్యులు. రామానుజన్ 1887 డిసెంబర్ 22న నిరుపేద దంపతులైన శ్రీనివాస అయ్యంగార్, కోయల అయ్యంగార్ లకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడ్ గ్రామంలో జన్మించాడు. తండ్రి కుంభకోణంలోని ఓ చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్ పాఠశాల విద్య కుంభకోణంలోనే జరిగింది. చిన్ననాటి నుంచి రామానుజన్ అసాధారణ తెలివితేటలు ప్రదర్శించే వాడు. రామానుజన్ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే.. ఆయన గణితంపై మాత్రమే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు, ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.*
*🔶️ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నాను సున్నాతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించిన మేధావితడు. ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే ప్రథముడిగా నిలిచారు. దాంతో ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజ గణితం, త్రికోణమితి, కలన గణితం, వైశ్లేషిక రేఖా గణితం మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 ఏళ్ల వయసులోనే పూర్తి చేశాడు.*
*🔷️శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్ రాసిన ‘సినాప్సిస్’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి రామానుజన్ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.*
*🔶️10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో ఎఫ్.ఏలో చేరాడు. కానీ కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఏడాది తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు. విద్యాభ్యాసం కుంటుపడుతున్నా రామానుజన్ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నాటి నెల్లూరు కలెక్టర్ రామస్వామి అయ్యంగార్ గారికి తన నోట్‌బుక్ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు. కొన్నాళ్ల తరవాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి.. డా.వాకర్ అనే వ్యక్తి మద్రాసు యూనివర్సిటీ నుంచి రూ.75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.*
*🔷️మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్ హార్ధీకి రామానుజన్ స్వయంగా, తన అర్హతలు, గణితంలోని ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్ హార్ధీ రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. అతడి పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడా ప్రొఫెసర్. 1914 మార్చి 17న రామానుజన్ మద్రాసు నుంచి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరవాత ఏప్రిల్ 7న లండన్ చేరాడు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కాలేజిలో ప్రవేశం పొంది 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీని వలన అతడి ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. 1914 నుంచి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు.*
*🔶️శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. 1918లో రాయల్ సోసైటీ ఆఫ్ ఇంగ్లండ్.. రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన "ఫెలో ఆఫ్ రాయల్ సోసైటి" బిరుదునిచ్చి గౌరవించింది. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.*
*🔷️1729ను రామానుజన్ సంఖ్య అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే...*
*రామానుజన్ అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన ఆచార్య హర్ధీ కారు నెంబర్ అది. రామానుజన్ 1729 ప్రాముఖ్యతను ఆ ప్రొఫెసర్ కు తెలియజేస్తూ.. రెండు ఘనాల మొత్తంగా, రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని దాని ప్రత్యేకతను వివరించాడు.*
* *1729 = 1³ + 12³*
* *1729 = 10³ + 9³*
*🔶️ప్రధాన సంఖ్యలపై రామానుజన్ ఇచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. అంతేకాకుండా "సమున్నత సంయుక్త సంఖ్య" అనే భావననూ ఈయనే ప్రవేశపెట్టారు. రామానుజన్ ప్రతిపాదించిన ‘మాక్ తీటా ఫంక్షన్స్’ కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్ కనుగొన్న తరవాత రోగర్-రామానుజన్ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు.*
*🔷️1916లో రామానుజన్ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.*
*🔶️రామానుజన్ మాపన సమీకరణలు ఎంత పరిమాణం వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. రామానుజన్ ప్రధాన సంఖ్యలు, భిన్నాలు, అనంత పరంపరలు, శృంఖ లిఖిత భిన్నాలు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్ "ఫ్రేయడ్ నోట్ బుక్స్" అంటారు. ఈ విధంగా రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవ, అభివృద్ధికి గానూ "ఫెలో ఆఫ్ రాయల్ సొసైటి" సభ్యత్వం రామానుజన్ కు లభించింది. రామానుజన్ చివరలో మద్రాసు విశ్వ విద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు. ఇలా గణిత శాస్త్రంపై ఎనలేని కృషి చేసిన ఈ లెజెండ్.. 32ఏళ్ల చిన్న వయసులోనే 26 ఏప్రిల్ 1920న తుదిశ్వాస విడిచారు. గణిత సూత్రాలు, గణిత సిద్ధాంతాలు, నంబర్ తీరమ్స్ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ పేరిట తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆయన జయంతిని 2012 నుంచి జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.*
*🙃చాలా మందికి గణితం అంటే నేటికీ భయమే. కానీ రామానుజన్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గణితం పట్ల ఆసక్తి పెంచుకోవాలని కాంక్షిస్తూ...😊*
*ధన్యవాదములతో...🙏🏻*
*✍🏻