Search This Blog

Sunday, December 17, 2017

Story మనకు ఆరోగ్యమే మహా భాగ్యమని తెలియదు.

ఒక పాము carpentry shop లోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది.  వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది.  ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనను attack  చేస్తుందనుకొని,  వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని  నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే  తెచ్చుకొంది.
మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి  అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.
జీవితంలో ప్రశాంతంగా  వుండలంటే  కొన్నిసార్లు అనవసరమైన కొన్ని  పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు  ద్వేషాలను ignore  చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు అసలు  react  కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది.
     జంతువులకు వాటి  ఆహారాన్ని మరియు కొంత  నగదును వాటి ముందు వుంచితే , అవి ఆహారం వరకు తిని, నగదు వైపు అసలు చూడవు. దాని అవసరంకూడా వాటికి తెలియదు.
    అదే   డబ్బు మరియ ఆరోగ్యం మనుషుల ముందు వుంచితే, ఎక్కువ మంది డబ్బునే తీసుకొంటారు. మనకు ఆరోగ్యమే మహా భాగ్యమని తెలియదు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top