*కమ్యూటేషన్*
*COMMUTATION*
🍀ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించ కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.
🍀ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.
(G.O.Ms.No.158 F&P తేది:1-4-1999)
🍀శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు.
(Rule 3(3) of Commutation Rules 1994)
🍀కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం
G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.
(G.O.Ms.No.356 F&P తేది:28-11-1989)
🍀పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.
(G.O.Ms.No.44 F&P తేది:19-02-1991)
🍀15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.
(G.O.Ms.No.324 F&P తేది:20-08-1977)
🍀కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.
(G.O.Ms.No.392 F&P తేది:02-12-1993)
🍀కమ్యూటేషన్ మొత్తానికి,గ్రాట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు.ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.