🙏
*🖐 మనం చేతివ్రేళ్ళ సహాయంతో Trigonometry Angle Values సులభంగా నేర్చుకుందాం*
ఒక్కో వ్రేలికి ఒక కోణము తీసుకుందాం. అవి *0°,30°,45°,60°,90°*
*💛 0° విలువలు కనుక్కుందాం.*
_చేతికి ముందు వైపు నుండి Sin విలువలు వస్తాయి, వెనుక వైపు నుండి Cos విలువలు వస్తాయి._
0° బొటన వ్రేలు దగ్గర ఉంది కావున ఆ వ్రేలుకి ముందు వైపు వ్రేళ్ళు ఏమీ లేవు కాబట్టి
*_Sin0° = 0_*
బొటన వ్రేలు తర్వాత 4 వ్రేళ్ళు ఉన్నాయి కావున
*_Cos0° = √4/2 = 2/2 = 1_*
(గమనిక:ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయో దానికి రూట్ కనుగొని , తర్వాత 2తో భాగించాలి.)
*💙 30° విలువలు కనుక్కుందాం.*
30° చూపుడు వ్రేలు దగ్గర ఉంది కావున ఆ వ్రేలుకి ముందు ఒక వ్రేలు ఉంది కావున
*_Sin30° = √1/2 = 1/2_*
చూపుడు వ్రేలు తర్వాత 3 వ్రేళ్ళు ఉన్నాయి కావున
*_Cos30° = √3/2_*
*💚 45° విలువలు కనుక్కుందాం*
45° మధ్య వ్రేలు దగ్గర ఉంది కావున ఆ వ్రేలుకి ముందు 2 వ్రేళ్ళు ఉన్నాయి కావున
*_Sin45° = √2/2 = 1/√2_*
మధ్య వ్రేలు తర్వాత 2 వ్రేళ్ళు ఉన్నాయి కావున
*_Cos45° = √2/2 = 1/√2_*
*💜 60° విలువలు కనుక్కుందాం*
60° ఉంగరం వ్రేలు దగ్గర ఉంది కావున ఆ వ్రేలుకి ముందు 3 వ్రేళ్ళు ఉన్నాయి కావున
*_Sin60° = √3/2_*
ఉంగరం వ్రేలు తర్వాత 1 వ్రేలు ఉంది కావున
*_Cos30° = √1/2 = 1/2_*
*❤ 90° విలువలు కనుక్కుందాం*
90° చిటికెన వ్రేలు దగ్గర ఉంది కావున ఆ వ్రేలుకి ముందు 4 వ్రేళ్ళు ఉన్నాయి కావున
*_Sin30° = √4/2 = 2/2 = 1_*
చిటికెన వ్రేలు తర్వాత వ్రేళ్ళు ఏమీ లేవు కావున
*_Cos90° = √0/2 = 0_*
🌈