Search This Blog

Sunday, July 9, 2017

ఉత్తర్వులు important

.

""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""'""'
              *📚ముఖ్యమైన  ఉత్తర్వులు:*
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
*📒సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.*
(G.O.Ms.No122 తేది:11-04-2016)

*📘మరణించిన ఫామిలీ మరియు* సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 చెల్లిస్తారు. పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.
(G.O.Ms101 తేది:21-04-2015)

*📙ఎయిడెడ్ విద్యాసంస్థల్లో* పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No.38 తేది:28-05-2013)

*📗ఫామిలీ పెన్షనర్ చనిపోతే* కుటుంబంలో ఎవరూ లేనిచోే వారసులకు చెల్లిస్తారు.
(G.O.Ms.No.136 తేది:29-06-2011)

నాన్ గజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలకు LKG నుండి ఇంటర్ వరకు Rs.2500 ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు.
(G.O.Ms.No.27 తేది:24-09-2015)

*📕ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని* ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్స్ చెల్లిస్తారు.
(G.O.Ms.No.56 తేది :02-05-2015)

*📚ఉద్యోగులుగా పనిచేయు భార్య, భర్తల* ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే Rs.7500 వడ్డీలేని ఫెస్టివల్ అడ్వాన్స్ మంజూరు చేస్తారు.
(G.O.Ms.No.39 తేది:15-04-2015)

*📗PHC Allowance* బేసిక్ పే పై 10% లేదా max Rs.2000 మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.103 తేది:24-07-2015)

*📕అంధ (Blind )* ఉపాధ్యాయులకు రీడర్ అలవెన్స్ మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.04 తేది:19-03-2016)

*📚FUNDAMENTAL RULES*

*📙F.R. 12(a)1* శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

*📘F. R. 12(బి)* ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

*📔F. R. 12(c)* ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

*📒F. R. 15(b)* ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

*📘F. R. 18 )* Govt appoint చేస్తే తప్ప, ఏ employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

*📙F. R.18(a)* 1year కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.

*📗F.R.18(బి)* పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5years కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

*📕F. R.18(c)* 5years కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్ లో ఉన్నపుడు అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

*📘F. R.22(a)* ప్రస్తుత పోస్ట్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్ట్ లోకి నియమించబడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేలు లో ఫై స్టేజి వద్ద స్థిరీకరించబడుతుంది.

*F. R.22 (a) (iv)* ఒక ఉద్యోగి APPSC ద్వారా మరొక పోస్ట్ కి సెలెక్ట్ అయినపుడు పాత పోస్ట్ లోని వేతనాన్కి తక్కువ కాకుండా కొత్తగా ఎంపిక ఐన పోస్ట్ లో వేతనం స్తిరీకరించబడును. కొత్త ఉద్యోగం లో చేరిన తేదీ నుంచి 1year తరువాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడును. ఇక పాత పోస్ట్ లోని ఇంక్రిమెంట్ డేట్ పోతుంది.

*📘F. R.22(B)* ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ కి పదోన్నతి పొందినప్పుడు, కింది పోస్ట్ లో పొందుతున్న వేతనానికి ఒక notional increment కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఫై స్టేజి వద్ద నిర్ణయి0చాలి. పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్తిరీకరణ కై ఆప్షన్ కలిగి ఉంటాడు.అవి (a) పదోన్నతి వచ్చిన తేదీ (b) కింది పోస్ట్ లో ఇంక్రిమెంట్ తేదీ కి ఆప్షన్ ఇచ్చుకోవటం.

*📙F. R.24* వార్షిక ఇంక్రిమెంట్ యధాలాపంగా వస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తి కరంగా లేకపొతే ఆతని ఇంక్రిమెంట్ అపి వేయవచ్చు. ఇలా అపి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు, అలా ఎంతకాలం అపి వేస్తున్నారో అలాగే with cumulative లేదా with out cumulative effect అన్న విషయం ఉత్తర్వుల లో తెలుపవలెను.

*📒Ex ఒక ఉద్యోగి 1.6.10 న* ఇంక్రిమెంట్ తీసుకున్న తరువాత పనిష్మెంట్ గా 2 ఇంక్రిమెంట్ లు ఆపారు అనుకుందాం.
(a) with cumulative effect ఈ విధంగా చేస్తే 1.6.13 నకు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది.
(b) with out cumulative effectఈ విధంగా చేస్తే 1.6.13 నకు 3 వార్షిక increment లు వస్తాయి.అంటే 2 వార్షిక increments arrears కోల్పోయినట్లు.

*📗 F. R.26 ఇంక్రిమెంట్ కి* పరిగణింపబడే సర్వీస్ కి సంబందించిన షరతులు ఉన్నాయి.
ఒక టైం స్కేల్ లో పని చేసిన కాలం ఇంక్రిమెంట్ కి  లెక్కించబడుతుంది.
ఐతే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది.
180 రోజుల వరకు వైద్య కారణాల తో జీత నష్టపు సెలవు వాడు కొన్నపుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము Head of department లకు ఇవ్వబడినది.

*📕F.R.26(a)* ఏదయినా పరీక్ష పాస్ అయిన0దు వల్ల ఉద్యోగికి ఏదయినా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరు అయినట్లు గా భావించాలి.

*📗కొత్తగా ఉద్యోగం లో చేరిన లేదా* ప్రమోషన్ పోస్ట్ లో చేరిన ఉద్యోగికి ఆతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరు అవుతుంది.
*📒Ex: 19.12.73* నాడు ఉద్యోగం లో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 1.12.74 నకే మంజూరు అవుతుంది.
ఒక ఉద్యోగి రిటైర్ ఐన తేదీ మరుసటి రోజు వార్షిక? ఇంక్రిమెంట్ తేదీ ఉన్నపుడు pentionery benifits కోసం notional మంజూరు అయినట్లు భావించి లెక్కించాలి.
ఐతే లీవ్ encashment వంటి వాటికి ఇది వర్తించదు.

*📙F. R.44 ఉద్యోగి లీవ్ లో* ఉన్నపుడు 4 నెలల వరకు HRA పూర్తి గా మంజూరు చేయవచ్చును.అర్ద లేదా పూర్తి వేతన సెలవు మీద వున్న ఉద్యోగి HRA, అతడు సెలవు మీద వెళ్ళేటప్పటి వేతనం మీద లెక్కించబడుతుంది.

*📘F.R.49 govt ఒక ఉద్యోగి ని* temporary గా 2 పోస్ట్ లకి నియమించవచ్చును.

*📕F.R.49(a) ఈ విధంగా* 2 పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో, ఆ వేతనం మంజూరు చేయవచ్చు.
ఉద్యోగిని అదనపు పోస్ట్ ను కూడా నిర్వహించమన్నపుడు మొదటి 3 నెలల వేతనం లో 1/5 భాగం ,next 3 నెలలు 1/10 భాగం అలవెన్సు చెల్లించబడుతుంది...
               _____________)
.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top